20 అడుగుల ఎత్తుతో భారీ బాహుబలి భోగిమంట.. వీడియో
సంక్రాంతి సందడి మొదలైంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే వేళ.. తెలుగు లోగిళ్లలో భోగి మంటలు వెలుగులు విరజిమ్మాయి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం కొమరిపాలెంలో భారీ బాహుబలి భోగిమంట వేశారు. ద్వారంపూడి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా భోగిమంటలు వేశారు.
52 టన్నుల కలపతో 40 అడుగుల చుట్టుకొలతతో 20 అడుగుల ఎత్తు భారీ బహుబలి భోగిమంట వేశారు. గత మూడు దశాబ్దాలుగా.. పూర్వీకుల నుండి ఈ భోగి మంట ఆచారం ఆనవాయితీగా వస్తోందన్నారు నిర్వాహకులు. రాష్ట్రంలోని ఎక్కడా లేని విధంగా కోమరిపాలెం లో ప్రతి సంవత్సరం రికార్డు స్థాయిలో భోగిమంట ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే నల్లమిల్లి చేతుల మీదుగా భోగిమంటకు పండితులు పూజలు నిర్వహించారు. సంక్రాంతి అంటే సంబరం మాత్రమే కాదు. సంక్రాంతిలో సైన్స్ వుంది. అందుకు నిదర్శనమే బోగిమంటలు. ఆవుపేడతో వెలిగించే భోగి మంటలు గాలిలో ఉన్న క్రిమికీటకాలను దూరం చేస్తాయి. పనికి రాని వస్తువులను భోగిమంటల్లో వేయడం ఆనవాయితీ. అది మన మనసుల్లో వున్న మలినాలను తీసేస్తుందని నమ్మకం. ఇలా పండగంటే సంబరం మాత్రమే కాదు. ఇందులో ఎంతో పరమార్ధం దాగి ఉంది. తెలుగు లోగిళ్లలో ఆనందాల భోగి వెలుగులు విరజిమ్ముతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం :
జపాన్లో సుకుమార్.. పుష్ప2 పనుల్లో బిజీబిజీ
కల్కి 2 హీరోయిన్ ఎవరు.. అసలేం జరుగుతోంది అక్కడ..?
చిరంజీవి..యాక్టింగ్ చించేశారు..అల్లు అరవింద్ రియాక్షన్ ఇదే
పెళ్లాం కాదు.. భర్త ఊరెళితే.. భర్త మహాశయులకు విజ్ఞప్తి రివ్యూ
20 అడుగుల ఎత్తుతో భారీ బాహుబలి భోగిమంట.. వీడియో
గంగిరెద్దుల కాలనీ చూసొద్దాం.. సంక్రాంతి సంబరాల్లో వీటి విన్యాసాలే
రంగుల మిరపకాయలు .. క్యాప్సికం మాత్రం కాదండోయ్
రైలు 2 గంటలు లేటైతే అవన్నీ ఫ్రీ... IRCTC రూల్ మీకు తెలుసా?
భారత నెమలి సింహాసనం ఎత్తుకెళ్లిన ఇరాన్
చలాన్ పడితే అకౌంట్ నుంచి మనీ కట్?
ఐటీ ఇబ్బందులా .. ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు వీడియో
