రైలుపై పడ్డ క్రేన్.. 22 మంది మృతి
థాయ్‌లాండ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ప్యాసింజర్ రైలుపై భారీ నిర్మాణ క్రేన్ ఒక్కసారిగా పడిపోవడటంతో సుమారు 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. బ్యాంకాక్‌కు 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిఖియో జిల్లాలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.
సిఖియో జిల్లాలో ప్రస్తుతం హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ పనుల్లో వినియోగిస్తున్న ఒక భారీ క్రేన్ బుధవారం ఉదయం అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి కింద ఉన్న పట్టాలపై జారిపడింది. దురదృష్టవశాత్తు అదే సమయంలో పట్టాలపై నుంచి ప్రయాణికులతో నిండిన రైలు వెళ్తోంది. ఎత్తు నుంచి పడిన క్రేన్ ధాటికి రైలు బోగీలు తునాతునకలు అయ్యాయి. క్షణాల్లోనే ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. క్రేన్ ధాటికి బోగీలు పట్టాలు తప్పడమే కాకుండా పెట్రోల్ ట్యాంకులు పేలి మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ప్రాణభయంతో అల్లాడిపోయారు. ఈ భీకర ప్రమాదంలో ఇప్పటివరకు 22 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 30 మంది మృత్యువుతో పోరాడుతున్నారు. క్రేన్ పడిన వేగానికి రైలు బోగీలు పట్టాలు తప్పడమే కాకుండా కొన్ని బోగీల్లో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో రైలులో చాలామంది ప్రయాణికులు ఉన్నారు.
మరిన్ని వీడియోల కోసం :
జపాన్లో సుకుమార్.. పుష్ప2 పనుల్లో బిజీబిజీ
కల్కి 2 హీరోయిన్ ఎవరు.. అసలేం జరుగుతోంది అక్కడ..?
చిరంజీవి..యాక్టింగ్ చించేశారు..అల్లు అరవింద్ రియాక్షన్ ఇదే
పెళ్లాం కాదు.. భర్త ఊరెళితే.. భర్త మహాశయులకు విజ్ఞప్తి రివ్యూ
"పాలక్ పనీర్" దెబ్బకు రూ. 1.6 కోట్ల లాస్ అయిన అమెరికా వర్సిటీ
రైలుపై పడ్డ క్రేన్.. 22 మంది మృతి
కేజీ బంగారు నిధి కేసులో బిగ్ ట్విస్ట్..కుటుంబ సభ్యులకు పండగే పండగ
దారం లేని పతంగ్ చూసారా? ఎలా ఎగురుతుందంటే..
20 అడుగుల ఎత్తుతో భారీ బాహుబలి భోగిమంట.. వీడియో
గంగిరెద్దుల కాలనీ చూసొద్దాం.. సంక్రాంతి సంబరాల్లో వీటి విన్యాసాలే
రంగుల మిరపకాయలు .. క్యాప్సికం మాత్రం కాదండోయ్
