AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ పిల్లలకు ఆట బొమ్మలు ఇస్తున్నారా?అయితే తస్మాత్‌ జాగ్రత్త!

మీ పిల్లలకు ఆట బొమ్మలు ఇస్తున్నారా?అయితే తస్మాత్‌ జాగ్రత్త!

Samatha J
|

Updated on: Aug 31, 2025 | 8:20 PM

Share

బృందావన్‌కు చెందిన 3 ఏళ్ల ప్రజ్ఞాన్ మరియు అతని 4 ఏళ్ల సోదరి హితాన్షి సడెన్‌గా కడుపు నొప్పి అంటూ విలవిలలాడిపోయారు. ఇద్దరు పిల్లలకు ఒకేసారి నొప్పి రావడంతో అనుమానించిన తల్లిదండ్రులు ఫరిదాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో ఎక్స్‌రే రిపోర్ట్‌ను చూసి తల్లిదండ్రులు షాక్‌ అయ్యారు. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన చిన్న బొమ్మల అయస్కాంతాలను మింగినట్లు గుర్తించారు.

ఫరీదాబాద్‌లోని అమృత హాస్పిటల్‌లో ఆ చిన్నారులను కాపాడేందుకు వైద్యులు వరుసగా శస్త్రచికిత్సలు చేశారు. ప్రజ్ఞాన్ ప్రేగులలో పది అయస్కాంతాలు ఒకదానికొకటి బిగించి ఉన్నట్లు గుర్తించారు. అవి ఎనిమిది చోట్ల రంధ్రాలు పడేలా చేశాయి. ఇక హితాన్షి కడుపులో ఆరు అయస్కాంతాలు ఇరుక్కుపోయాయి. “ఇది మేము ఎదుర్కొన్న అత్యంత క్లిష్ట పరిస్థితులలో ఒకటి” అని ఫరీదాబాద్‌లోని అమృత హాస్పిటల్‌లోని పీడియాట్రిక్ సర్జరీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ నితిన్ జైన్ అన్నారు. ఈ అయస్కాంతాలను ‘సైలెంట్ కిల్లర్’ అని అన్నాడు. ఒక చిన్న అయస్కాంతం తరచుగా సమస్య లేకుండా శరీరం గుండా వెళుతుంది, కానీ ఒకటి కంటే ఎక్కువ అయస్కాంతాలను మింగినప్పుడు, అవి పేగులోని వివిధ భాగాలకు వెళ్లి పేగు గోడలపై అంటుకుపోతాయి. వాటి మధ్య చిక్కుకున్న కణజాలం రక్త సరఫరాను కోల్పోతుంది, అలా నెక్రోటిక్‌గా మారుతుంది. త్వరగా చిల్లులు ఏర్పడి.. ఇది ప్రాణాంతక ఇన్ఫెక్షన్లకు కారణమవుతుందని వైద్యులు తెలిపారు. పిల్లలు ఆటబొమ్మలతో ఆడుకుంటున్నప్పుడు పేరెంట్స్‌ ఓ కంట కనిపెడుతూ ఉండాలని వైద్యులు సూచించారు.

మరిన్ని వీడియోల కోసం :

ఏఐతో ఓ యూజర్‌ సంభాషణ.. షాక్‌తిన్న చాట్‌జీపీటీ.. ఏం జరిగిందంటే..

వింత ఘటన.. నీలం రంగులో గుడ్డు పెట్టిన నాటు కోడి వీడియో

17వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. ‘తల్లికి వందనం’ అమలు చేయాలంటూ డిమాండ్ వీడియో