17వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. ‘తల్లికి వందనం’ అమలు చేయాలంటూ డిమాండ్ వీడియో
ప్రస్తుత కాలంలో పెళ్లి, పిల్లలు బాధ్యతలు అంటే భయపడిపోతున్నారు. యువత చాలామంది పెళ్లి చేసుకోడానికి విముఖత చూపుతున్నారు. దీనికి రోజురోజుకీ పెరుగుతున్న లివింగ్ కాస్ట్ ఒక కారణమైతే.. ఆర్ధిక స్థితిగతులు ఇలా కారణమేదైనా యువత ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అది దేశ జనాభాపై తీవ్ర ప్రవభావం చూపుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా జనాభా తగ్గిపోవడంతో ఒక్కో కుటుంబం ఇద్దరు లేదా ముగ్గురు పిల్లల్ని కనాలని, అలాంటి వారికా రాయితీలు కల్పిస్తామని పలు దేశాధినేతలు ప్రోత్సహిస్తున్నాయి కూడా.
ఇదిలా ఉంటే.. ఓ జంట ఏకంగా 17 మంది సంతానానికి జన్మనిచ్చింది. వైద్యరంగంలో చర్చనీయాంశంగా మారిన ఈ విచిత్ర ఘటన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వెలుగు చూసింది. ప్రస్తుతం సదరు మహిళకు 55 ఏళ్లు. తాజాగా మరోమారు కాన్పుకు వచ్చిన ఆమె.. 17 వ సారి విజయవంతంగా ప్రసవించి.. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌కు చెందిన రేఖ గల్బెలియా అనే మహిళ.. ఏకంగా 17 మంది పిల్లలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. చెత్త ఏరుకుంటూ జీవనం సాగించే కావ్రా, రేఖ దంపతులకు గతంలో జన్మించిన 16 మంది సంతానంలో నలుగురు కుమారులు, ఒక కుమార్తె పుట్టిన వెంటనే మరణించారు. మరో ఐదుగురికి వివాహాలు జరిగాయి. అయితే తాజాగా పురిటినొప్పులతో ఆస్పత్రికి వచ్చిన రేఖ.. నాలుగో ప్రసవం అని వైద్యులకు అబద్ధం చెప్పి ఆస్పత్రిలో చేరినట్లు జాడోల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో గైనకాలజిస్ట్ రోషన్ దరంగి తెలిపారు. తర్వాత ఆసలు విషయం తెలిసి వైద్యులు షాకయ్యారు. ఆమె కుమార్తెల్లో శిలా కల్బెలియా అనే అమ్మాయి తమ కుటుంబం ఆర్ధిక పరిస్థితి గురించి చెబుతూ ప్రభుత్వాన్ని సాయం కోరింది. తమకు ఇళ్లు లేదని, పిల్లల్ని చదివించేందుకు ప్రభుత్వం సాయం చేయాలని విజ్ఞప్తి చేసింది.
మరిన్ని వీడియోల కోసం :
దారుణం.. పెళ్లయిన మూడు నెలలకే భార్యను చంపి..ప్రియురాలితో వీడియో
ఇక శ్వాస పరీక్ష ద్వారా.. మధుమేహం గుట్టు రట్టు వీడియో
ఆలస్యంగా తల్లి కావాలనుకునే వారికి ఇది వరం.. వీడియో
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
