ఇక శ్వాస పరీక్ష ద్వారా.. మధుమేహం గుట్టు రట్టు వీడియో
మధుమేహాన్ని శ్వాస వదిలినంత సునాయాసంగా నిర్ధారించే రోజులు రాబోతున్నాయి. శ్వాసలోని అసిటోన్ ను గుర్తించే సెన్సార్ ను పరిశోధకులు అభివృద్ధి చేయడంతో ఇది సాధ్యం కాబోతోంది. దీని ద్వారా మధుమేహాన్ని, ప్రీ డయాబెటిస్ ను వేగంగా, చౌకగా గుర్తించవచ్చు. పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ సెన్సార్ ను అభివృద్ధి చేశారు. కెమికల్ ఇంజనీరింగ్ జర్నల్ లో ఈ పరిశోధనా ఫలితాలను ప్రచురించారు. ప్రస్తుత పద్ధతుల్లో డయాబెటిస్, ప్రీ డయాబెటిస్ ను గుర్తించాలంటే డాక్టర్ ని సంప్రదించాల్సి ఉంటుంది.
లాబ్ వర్క్ జరగాల్సి ఉంటుంది. వీటికి డబ్బు, సమయం అధికంగా అవసరం అవుతాయి. సాధారణంగా రక్తం లేదా చెమటలోని గ్లూకోజ్ ను ఉపయోగించి పరీక్ష చేస్తుంటారు. కరిగే కొవ్వుకు ఉప ఉత్పత్తిగా అసిటోన్ ప్రతి ఒక్కరి శ్వాసలోనూ ఉంటుంది. అయితే అసిటోన్ లెవెల్స్ 1.8 పార్ట్స్ పర్ మిలియన్ కన్నా ఎక్కువగా ఉంటే మధుమేహం ఉన్నట్లు నిర్ధారిస్తారు. చెమటలోని గ్లూకోజ్ ను గుర్తించే సెన్సార్లు ఉన్నాయి. కానీ పరీక్ష కోసం వ్యాయామం, రసాయనాలు లేదా వేడిగాలి, ఆవేరి స్నానానికి ఉపయోగించే గది అవసరం అవుతాయని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన హువాన్ యు ల్యారి చెంగ్ చెప్పారు. అందుకే ఈ పద్ధతి అన్ని వేళలా ఆచరణ సాధ్యమైనది కాదన్నారు. తాము అభివృద్ధి చేసిన విధానంలో ఓ వ్యక్తి శ్వాసను ఓ సంచిలోకి వదిలితే ఆ సంచిలోని సెన్సార్ కొన్ని నిమిషాల తర్వాత ఫలితాలను వెల్లడి చేస్తుందని అన్నారు. నేరుగా ముక్కు కింద కానీ, మాస్క్ లోపల కానీ పనిచేసే చరికొత్త సెన్సార్ ని ఇకపై అభివృద్ధి చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం :
రన్నింగ్ ట్రైన్ ఎక్కబోతూ కిందపడ్డ మహిళ.. తర్వాత ఏమైందంటే? వీడియో
యువతి ప్రా*ణం తీసిన ట్రయాంగిల్ లవ్..వీడియో
రణ్‌బీర్ కపూర్, ఆలియా .. రూ. 250 కోట్ల లగ్జరీ భవనం చూశారా వీడియో
తాత చేసిన పనితో.. అంతులేని సంపద మనవడి సొంతం..!
వామ్మో.. వీడి ట్యాలెంట్ చూసి పోలీసులే షాక్ అయ్యారు..!
మలంతో లక్షల సంపాదన.. ప్రాణాలు కాపాడుతున్న యువకుడు!
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్

