యువతి ప్రా*ణం తీసిన ట్రయాంగిల్ లవ్..వీడియో
అనంతపురం లో ట్రయాంగిల్ ప్రేమ వ్యవహారం తీవ్ర విషాదాన్ని నింపింది. ఒకే వ్యక్తిని ప్రేమించిన ఇద్దరు యువతుల మధ్య తలెత్తిన వివాదం చివరికి ఒకరి ఆత్మహత్యకు దారితీసింది. సహోద్యోగి నుంచి వచ్చిన బెదిరింపులతో భయపడిపోయిన ఓ యువతి తీవ్ర మనస్థాపంతో ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం అనంతపురం సాయి నగర్ లోని దీప్తి బ్లడ్ బ్యాంక్ లో అరుణ్ కుమార్, ప్రతిభ భారతి, స్వాతి మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్లుగా పనిచేస్తున్నారు.
గుత్తికి చెందిన అరుణ్ కుమార్ తో ప్రతిభ భారతి గత రెండేళ్లుగా ప్రేమలో ఉంది. వీరితో పాటు పనిచేస్తున్న పెనుగొండ మండలం గొందిపల్లికి చెందిన స్వాతితో కూడా అరుణ్ కుమార్ కు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో మొదటి ప్రియురాలికి తెలియకుండా అరుణ్ స్వాతితో రహస్యంగా ప్రేమ వ్యవహారం కొనసాగించాడు. కొంతకాలానికి ఈ విషయం ప్రతిభ భారతికి తెలిసింది. దీంతో ఆగ్రహానికి గురైన ఆమె సోమవారం ఉదయం ఏడు గంటల సమయంలో స్వాతికి ఫోన్ చేసి తీవ్ర స్థాయిలో మందలించింది. నా ప్రియుడితోనే ప్రేమ వ్యవహారం నడుపుతావా? మీ ఇద్దరి విషయం నాకు తెలిసిపోయింది. ఈరోజు ల్యాబ్ కు రా నీ సంగతి తెలుస్తా అంటూ పరుష పదజాలంతో బెదిరించింది. ఈ ఫోన్ కాల్ తో స్వాతి తీవ్ర భయాందోళనలకు గురైంది. సహోద్యోగి బెదిరింపులతో తీవ్ర మనస్థాపం చెందిన స్వాతి తాను ఉంటున్న హాస్టల్ లో తన గదిలో ఎవ్వరూ లేని సమయంలో ఫ్యాన్ కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ సిబ్బంది గమనించి వెంటనే ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు రెండో పట్టణం సీఐ శ్రీకాంత్ తెలిపారు.
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

