రన్నింగ్ ట్రైన్ ఎక్కబోతూ కిందపడ్డ మహిళ.. తర్వాత ఏమైందంటే? వీడియో
కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన ఒక మహిళ పట్టుతప్పి ప్లాట్‌ఫామ్, రైలు పట్టాల మధ్య పడిపోయింది. ఆమె ట్రాక్ పై పడిన సమయంలో ఒక నిమిషం పాటు ఆమె మీదుగా రైలు వెళ్ళింది. ఆర్‌పీఎఫ్ సిబ్బంది అలర్ట్ తో రైలు ఆగింది. దీంతో ట్రాక్ పై పడిన మహిళను ఆర్‌పీఎఫ్ సిబ్బంది రక్షించారు. ఉత్తరప్రదేశ్ లోని ఖాన్ పూర్ స్టేషన్ లో ఈ ఘటన జరిగింది.
అయోధ్యకు చెందిన 67 ఏళ్ల మహిమా గంగువార్ తన భర్త రాజ్ వీర్ తో కలిసి శనివారం రాత్రి ఖాన్ పూర్ సెంట్రల్ స్టేషన్ కు చేరుకున్నారు. అర్ధరాత్రి పన్నెండు గంటలకు ప్లాట్‌ఫామ్ నుంచి అప్పటికే బయలుదేరిన భోపాల్ ఎక్స్ ప్రెస్ ను అందుకోవడానికి మహిమా ప్రయత్నించారు. హడావిడిలో అదుపు తప్పిన ఆమె ప్లాట్‌ఫామ్, రైలు పట్టాల మధ్య జారి పడిపోయారు. ఆందోళన చెందిన ఆమె భర్త ప్రయాణికులు కేకలు వేశారు. దాంతో ఆ రైలు వెంటనే ఆగింది. మరోవైపు ఆర్‌పీఎఫ్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. ప్లాట్‌ఫామ్ కి రైలు పట్టాలకి మధ్య పడిన ఆ మహిళకు ధైర్యం చెప్పారు. భర్త సహాయంతో ఆమెను సురక్షితంగా బయటకు తీశారు. స్వల్పంగా గాయపడిన ఆ మహిళకు ప్రథమ చికిత్స అందించారు. డాక్టర్ అయిన ఆమె కొడుకుకు సమాచారం అందించడంతో అతను అక్కడికి చేరుకున్నాడు. తర్వాత చికిత్స కోసం తల్లిని తన వెంట తీసుకు వెళ్ళాడు. రైల్వే స్టేషన్ లోని సిసిటివిలో నమోదైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
