AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మోనాలిసా ఇలా అయిందేంటి? వివాదంలో కేరళ ప‌ర్యాట‌క‌శాఖ‌ వీడియో

మోనాలిసా ఇలా అయిందేంటి? వివాదంలో కేరళ ప‌ర్యాట‌క‌శాఖ‌ వీడియో

Samatha J
|

Updated on: Aug 28, 2025 | 10:58 PM

Share

వంద ఏళ్ళనాటి లియోనార్డో డవిన్సి కళాఖండం మోనా లిసా ఇప్పటికీ కళా ప్రియులని ఆకర్షిస్తూనే ఉంది. మోనా లిసా చిరునవ్వుపై నెట్టింట ఇప్పటికీ వాడిగా వేడిగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే లెజెండరీ పెయింటర్ వేసిన ఆ పోర్ట్రైట్ ను ఇప్పుడు కేరళ సర్కార్ తమ ప్రమోషన్ కోసం వాడుకుంది. స్మైలీ మోనా లిసా కాస్త కేరళ కుట్టిగా మారిపోయింది. బొట్టు మల్లెపువ్వులు పెట్టుకుంది.

బంగారు రంగు ఎంబ్రాయిడరీ పట్టు ఉన్న కేరళ చెన్నైత కసావు చీరకట్టులో మెరిసింది. బంగారు ఆభరణాలు ధరించింది. ఈ కేరళ మోనా లిసా ఓనం పండుగను ప్రమోట్ చేయడానికి కేరళ పర్యాటక శాఖ ఏఐ ద్వారా జనరేట్ చేసిన మోనా లిసా చిత్రాన్ని వాడుకుంది. కేరళ పద్ధతి స్టైల్ లో దర్శనమిస్తున్న మోనా లిసా ఫోటోపై విమర్శలు వస్తున్నాయి. కళాకారుడు లియోనార్డో డవిన్సి బొమ్మను మార్చిన తీరు నైతికతకు వ్యతిరేకమని కొందరు అంటున్నారు. స్టేట్ ఆఫ్ హార్మోని క్యాంపెయిన్ కోసం కేరళ సర్కార్ మోనా లిసా ఏఐ పిక్ ను ప్రచారం చేయడం సరికాదని అంటున్నారు. 1503 నుంచి 1506 మధ్య కాలంలో లియోనార్డో డవిన్సి ఆ కళాఖండాన్ని వేశారు. పారిస్ లోని లౌవ్రే మ్యూజియంలో ప్రస్తుతం ఆ చిత్రం రాజ్యం ఉంది. లిసా గెరార్డిని అనే యువతిని గీసే ప్రయత్నంలో మోనా లిసా పెయింటింగ్ పుట్టినట్లు చెబుతుంటారు. లియోనార్డో డవిన్సి 1519లో మరణించారు. కాపీరైట్ చట్టం ఇప్పటికీ వర్తిస్తుందని కొందరు ఒరిజినల్ కళాకృతిని మార్చడం నేరమవుతుందని మరికొందరు వాదిస్తున్నారు. ఓనం ఉత్సవాలను ప్రమోట్ చేసేందుకు ఈ పిక్ ను వినియోగిస్తున్నట్లు కేరళ టూరిజం శాఖ తన ప్రకటనలో పేర్కొంది.