వీడియో కోసం వెళితే.. ప్రాణాలే పోయాయి
సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్ కోసం యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా అలాంటి ఓ ఘోర విషాదం ఒడిశాలో జరిగింది. యూట్యూబ్ ఛానెల్ కోసం ఓ వీడియో చిత్రీకరించాలన్న ఉత్సాహం ఒక యువకుడి ప్రాణాలను బలిగొంది. స్నేహితుల కళ్ల ముందే అతడు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన హృదయ విదారక ఘటన కొరాపుట్ జిల్లాలోని డుడుమా జలపాతం వద్ద జరిగింది.
యూట్యూబర్ సాగర్ తన స్నేహితులతో కలిసి డుడుమా జలపాతాన్ని సందర్శించాడు. అక్కడి ప్రకృతి అందాలను, ఉద్ధృతంగా ప్రవహిస్తున్న జలపాతాన్ని షూట్ చేయాలని అనుకున్నాడు. ఈ క్రమంలో చేతిలో డ్రోన్ పట్టుకుని నెమ్మదిగా నీళ్లలోకి దిగి ఒడ్డుకు కొద్ది దూరంలోని ఓ రాయి వద్ద కు చేరి, దానిపై నిలబడి డ్రోన్ ఎగురవేసి.. జలపాతం అందాలను కవర్ చేస్తున్నాడు. సరిగ్గా.. ఈ టైంలోనే.. ఎగువనున్న మాచ్‌ఖండ్ డ్యామ్ నుంచి అధికారులు నీటిని విడుదల చేయటంతో.. ఆ ప్రాంతంలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. క్షణాల్లో కంటి ముందే వరదనీరు తనమీదికి దూసుకురావటంతో సాగర్ అడుగు తీసి అడుగు వేయలేకపోయాడు. నీరు క్షణాల్లో అతడిని ముంచెత్తటంతో ప్రమాదాన్ని గమనించిన స్నేహితులు అతడిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ, వరద తీవ్రత మరింత పెరగడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఆఖరికి.. వారంతా చూస్తుండగానే సాగర్ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. తమ కళ్ల ముందే స్నేహితుడు గల్లంతు కావడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపించారు. వాస్తవానికి.. ఫలానా టైమ్‌కి మాచ్‌ఖండ్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు ముందే దిగువ ప్రాంతాలలో హెచ్చరికలు జారీ చేసారు. కోరాపుట్‌లో అతి భారీ వర్షాలు కురవడంతో నీటిని కిందకు వదులుతున్నట్లు కూడా వారు స్థానికులకు ముందుగానే వివరించి.. తగిన జాగ్రత్తలు చెప్పారు. కానీ, అవేవీ తెలియని సాగర్ అతని మిత్రబృందం వీడియో షూటింగ్ కోసం జలపాతం వద్దకు వచ్చి ఊహించని ప్రమాదంలోకి ఇరుక్కున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రేమకథకు గుర్తుగా.. రాళ్ల యుద్ధం.. ఈ జాతర ప్రత్యేకత అదే
OG: టాటూ కారణంగా.. బయటపడ్డ OG కథ
శ్రీదేవి ఆస్తి కోసం చెన్నై హై కోర్టు మెట్లెక్కిన భర్త బోనీ కపూర్
మనోడు మామూలోడు కాదుగా.. ఏకంగా పెళ్లే చేసుకోనన్న హీరోయిన్‌నే పడేశాడు?
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే

