ప్రేమకథకు గుర్తుగా.. రాళ్ల యుద్ధం.. ఈ జాతర ప్రత్యేకత అదే
శతాబ్దాల నాటి ఒక పౌరాణిక ప్రేమకథకు ప్రతీకగా నిర్వహించే గోత్మార్ జాతర మరోసారి రక్తసిక్తంగా మారింది. మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లా పంధుర్నలో జరిగిన ఈ జాతరలో రాళ్ల వర్షం కురిసింది. ఈ ఘటనలో సుమారు 1,000 మంది గాయపడ్డారు. కాగా.. ఇది ‘ స్థానిక సంప్రదాయాల పేరిట జరుగుతున్న హింస’ అంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సుమారు 400 సంవత్సరాల నాటి ఒక పౌరాణిక కథ ఈ ఆచారానికి మూలం. ఆ కథలో పంధుర్నాకు చెందిన యువకుడు, సావర్గావ్‌కు చెందిన యువతి ప్రేమించుకుని పారిపోవడానికి ప్రయత్నించారు. వారు జామ్ నది ఒడ్డుకు చేరుకోగా, వారిని ఆపేందుకు గ్రామస్తులు రాళ్ళు విసరగా,ఆ దాడిలో ఆ ప్రేమికులిద్దరూ మరణించారు. వారి ప్రేమకు గుర్తుగా, ప్రతి సంవత్సరం భాద్రపద అమావాస్య నాడు జామ్ నది ఒడ్డున ఈ గోత్మార్ జాతర నిర్వహిస్తారు. ఈ సంవత్సరం జాతరలో పంధుర్న , సావర్గావ్ గ్రామాలకు చెందిన ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి రాళ్ల యుద్ధం చేసుకున్నారు. సావర్గావ్ గ్రామస్తులు అడవి నుండి తీసుకొచ్చిన పలాష్ చెట్టును నది మధ్యలో నాటగా, పంధుర్నా గ్రామస్తులు ఆ చెట్టును లాగేయడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో రెండు వైపుల నుండి ఒకరిపై ఒకరు రాళ్లను విసురుకున్నారు. ఈ హింసాత్మక ఘర్షణలో 1,000 మందికి పైగా ప్రజలు గాయపడ్డారు. జాతరలో హింస జరిగే ప్రమాదాన్ని గుర్తించిన అధికారులు.. ఆ ప్రాంతంలో నిషేధాజ్ఞలు విధించి, నదికి రెండు వైపులా 600 మందికి పైగా పోలీసులను మోహరించారు. అయినా.. గ్రామస్తులు ఇవేమీ పట్టించుకోకుండా తమ సంప్రదాయాన్ని కొనసాగించారు. 1955 నుంచి ఇప్పటి వరకు ఈ జాతరలో 13 మంది రాళ్ల దాడిలో చనిపోగా, వారిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉండటం విషాదం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
OG: టాటూ కారణంగా.. బయటపడ్డ OG కథ
శ్రీదేవి ఆస్తి కోసం చెన్నై హై కోర్టు మెట్లెక్కిన భర్త బోనీ కపూర్
మనోడు మామూలోడు కాదుగా.. ఏకంగా పెళ్లే చేసుకోనన్న హీరోయిన్‌నే పడేశాడు?
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే

