పండగ వేళ హాట్ టాపిక్‌గా బ్రహ్మీ..
దేశ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వీధుల్లో కొలువైన గణపతి విగ్రహాలు భక్తులతో పూజలందుకుంటున్నాయి. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ గణేష్ చతుర్థి వేడుకల్లో భాగమవుతున్నారు. ఈ క్రమంలో లెజెండరీ నటుడు, స్టార్ కమెడియన్ బ్రహ్మానందం కు సంబంధించిన కొన్ని ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.
ఇందులో ఆయన తమ స్వగృహంలో మట్టి వినాయకుడిని తయారు చేస్తూ కనిపించారు. అలా కనిపించి పర్యావరణానికి హానీ కలిగించకుండా ఎకో ఫ్రెండ్లీ గణేశాను పూజించాలని సందేశం ఇచ్చారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అయితే ఇక్కడో షాకింగ్ విషయం ఏంటంటే… ఈ ఫొటోస్ ఇప్పటివి కావని తెలుస్తోంది. కరోనా టైమ్ లో తీసిన ఫొటోలని ఇప్పుడు మరో సారి ఆయన ఫ్యాన్స్ నెట్టింట వైరల్ చేస్తూన్నారు. ఆ ఫోటోలని చూసి ఇప్పటివని భ్రమ పడుతూ .. మరి కొంత మంది వాటిని రీ షేర్ చేస్తూ.. వైరల్ చేస్తున్నారు. ఇక బ్రహ్మానందం వినాయకుడి ప్రతిమ తయారు చేయానికి అప్పటి బ్యాక్ గ్రౌండ్ స్టోరీ ఏంటంటే.,.అప్పుడు అంటే కారోనా టైంలో వినాయక చవితికి గణపతి విగ్రహాల ప్రతిష్టించడానికి ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వలేదు. దీనితో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు ఎవరు ఇంట్లో వాళ్లే మట్టి గణపయ్యని తయారుచేసుకున్నారు. ఇంట్లోనే ప్రతిష్టించుకొని పూజలు చేసుకున్నారు. అలా బ్రహ్మానందం కూడా ఇంట్లోనే మట్టి గణపతిని తయారుచేసి పూజలు నిర్వహించారు. అప్పటి ఫొటోలను మళ్లీ ఒక నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి కాస్తా ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. చాలా మంది సినీ అభిమానులు, నెటిజన్లు ఈ ఫొటోలను షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ‘బ్రహ్మీ ది క్రియేటర్’ అంటూ తెగ పొగిడేస్తున్నారు. బ్రహ్మీ లానే అందరూ మట్టి గణపతులనే పూజించాలంటూ నెట్టింట ప్రచారం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తెలుగు బిగ్ బాస్‌లోకి దండుపాళ్యం హీరోయిన్
సరస్సులో 18 కోట్ల ఏళ్ల నాటి డైనోసార్ శిలాజాలు
ఎస్.. భార్యంటే ఆ మాత్రం భయం ఉండాల్సిందే..!
తాతను ఏం మాయ చేసావే.. 81 ఏళ్ల వృద్ధుడికి వలపు వల! ఏం చేశారంటే
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

