ఎస్.. భార్యంటే ఆ మాత్రం భయం ఉండాల్సిందే..!
చాలామంది తమ వాహనాల వెనుక రకరకాల సందేశాలు రాసుకుంటారు. చెడపకురా.. చెడేవు, నన్ను చూసి ఏడవకురా అని కొందరు.. అమ్మ..నాన్న గిఫ్ట్.. ఇలా రకరకాల కొటేషన్స్ రాసుకుంటారు. ఆటోలు, కార్లు, లారీల వెనుక కనిపించే ఇలాంటి కొన్ని కొటేషన్స్ మనిషిని ఆలోచింపచేస్తాయి. అయితే ఓ వాహనదారుడు తన కారు వెనుక రాసిన కొటేషన్ చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.
అది భయమా, భక్తా.. లేక భయం వల్ల వచ్చిన గౌరవమా అని ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో రోడ్డు మీద ఓ తెల్లని కారు వెళ్తోంది. దానిపైన ఓ ఆసక్తికరమైన కొటేషన్ రాసిఉంది. అది వెనకనున్న వాహనదారులను ఆకర్షించటంతో వారంతా దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ కారుపైన ఏమని రాసి ఉందంటే.. ‘ఇది నా భార్య కారు’ అని రాసి ఉంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ కొటేషన్‌చూసి తెగ నవ్వుకుంటున్నారు. ‘భార్య అంటే ఆ మాత్రం భయం ఉండాలి మరి’.. అంటూ కొందరు, ‘అలా రాయకపోతే చంపేస్తుందని భయపడ్డాడేమో’.. అంటూ ఇంకొందరు, ఆ కారు అతడి భార్య గిఫ్ట్‌గా ఇచ్చిందేమో అని మరికొందరు, భార్య అంటే ఎంత భయమో.. అంటూ పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటికే దాదాపు 3 లక్షలమంది వీక్షించారు. 2 వేలమందికి పైగా లైక్ చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తాతను ఏం మాయ చేసావే.. 81 ఏళ్ల వృద్ధుడికి వలపు వల! ఏం చేశారంటే
వామ్మో.. వీడి ట్యాలెంట్ చూసి పోలీసులే షాక్ అయ్యారు..!
మలంతో లక్షల సంపాదన.. ప్రాణాలు కాపాడుతున్న యువకుడు!
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్
కొవిడ్ తరహా స్క్రీనింగ్.. ఆ ఎయిర్పోర్టుల్లో మళ్ళీ మొదలు

