తాతను ఏం మాయ చేసావే.. 81 ఏళ్ల వృద్ధుడికి వలపు వల! ఏం చేశారంటే
ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు కేటుగాళ్లు రోజుకో కొత్తరకం మోసాలతో జనాలకు కుచ్చుటోపీలు పెడుతున్నారు. జనాలు కూడా ఈ మోసగాళ్లను ఈజీగా నమ్మి కస్టపడి సంపాదించిన డబ్బును మొత్తం పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో వెలుగు చూసింది. అమీర్ పేట్‌కు చెందిన 81 ఏళ్ల వృద్ధుడికి జూన్ నెలలో మాయ రాజ్‌పుత్ అనే మహిళ పేరుతో వాట్సాప్‌లో కాల్స్, మెసేజ్స్ చేశారు స్కామర్స్.
ఆయనతో చనువుగా మాట్లాడుతూ, మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకున్నారు కేటుగాళ్లు. చనువు ఏర్పడ్డాక తమ ప్లాన్ అమలు చేశారు. తనతో చాట్ చేస్తున్న మహిళకు ఎన్నో కష్టాలు ఉన్నట్టు చాట్‌లోనే బోరుమన్నారు. వైద్య ఖర్చులు, తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను విడిపించాలని.. అందుకు కొన్ని డబ్బులు కావాలని కోరారు. అది నిజమేనని నమ్మిన వృద్దుడు పలు దఫాలుగా తనతో చాట్ చేస్తున్నది కేటుగాళ్లు అని తెలియక వారు ఇచ్చిన నంబర్‌కు డబ్బులు పంపడం స్టార్ట్ చేశారు. ఇలా ఆ వృద్ధుడి నుంచి మొత్తం రూ. 7 లక్షల 11 వేల వరకు కాజేశారు కేటుగాళ్లు. అక్కడితో ఆగకుండా ఇంకా తమకు డబ్బులు కావాలని కేటుగాళ్లు ఆ వృద్దుడిని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు. దీంతో అనుమానం వచ్చిన బాధితుడు తమ కుటుంబ సభ్యుల సహాయంతో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. జరిగిన విషయం మొత్తం పోలీసులకు చెప్పి ఘటనపై ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

