మనోడు మామూలోడు కాదుగా.. ఏకంగా పెళ్లే చేసుకోనన్న హీరోయిన్‌నే పడేశాడు?
చెన్నైలో పుట్టి పెరిగాడు అర్జున్ దాస్. ఆ తర్వాత దుబాయ్ వెళ్లి అక్కడే బ్యాంక్ ఉద్యోగిగా స్థిర పడ్డాడు. అయితే సినిమాలపై మక్కువతో మళ్లీ ఇండియాకు తిరిగొచ్చేశాడు. ఏకంగా 40 కిలోల బరువును తగ్గించుకుని నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. 2015లో ఓ తమిళ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయైన అర్జున్ దాస్ పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు.
హీరోగా, సహాయక నటుడిగా, విలన్ గా .. ఇలా అన్ని పాత్రలతోనూ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన మాస్టర్, విక్రమ్ సినిమాల్లో అర్జున్ దాస్ యాక్టింగ్ అద్దిరిపోయింది. ఆక్సిజన్, బుట్టబొమ్మ లాంటి స్ట్రెయిట్ తెలుగు సినిమాల్లోనూ నటించిన ఈ నటుడు ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఓజీలోనూ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. కోలీవుడ్ లో హ్యాండ్సమ్ యాక్టర్లలో ఒకరైన అర్జున్ దాస్.. అప్పుడప్పుడు లవ్, డేటింగ్ విషయాలతోనూ వార్తల్లో నిలుస్తుంటాడు. ముఖ్యంగా ఒక ప్రముఖ హీరోయిన్ తో అతను ప్రేమలో ఉన్నాడంటూ రూమర్లు వినిపిస్తుంటాయి. గతంలో ఇదే తరహా గుసగుసలు వినిపించగానే వాటిని అర్జున్ దాస్ ఖండించారు. సదరు హీరోయిన్, తాము మంచి స్నేహితులమంటూ వివరణ ఇచ్చాడు. ఇప్పుడు మళ్లీ అర్జున్ దాస్ ప్రేమ వ్యవహారం కోలీవుడ్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖ దర్శకుడు బాలాజీ మోహన్ తెరకెక్కిస్తోన్న ఓ వెబ్ సిరీస్ లో అర్జున్ దాస్ ఆ క్రేజీ హీరోయిన్ కలిసి నటిస్తున్నారు. దీంతో మరోసారి వీరి లవ్ రూమర్లు నెట్టింట వైరలవుతున్నాయి. వీరిద్దరూ ప్రేమలో ఉండటం వల్లే కలిసి వెబ్ సిరీ్‌సలో నటించారంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ అర్జున్ దాస్ పడిపోయింది ఎవరికో తెలుసా? హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి. మట్టి కుస్తీ తో పాటు పలు సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు చేరువైన ఈ అందాల తారతో అర్జున్ ప్రేమలో ఉన్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రజెంట్ ఐశ్వర్య లక్ష్మి తెలుగులో సాయి ధరమ్ తేజ్ సరసన సంబరాల ఏటి గట్టు సినిమాలో నటిస్తోంది. గతంలో లవ్, డేటింగ్ , మ్యారేజ్ లపై పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది ఐశ్వర్య లక్ష్మి. అసలు తానే పెళ్లి చేసుకోనంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. మరి అలాంటి స్టేట్ మెంట్ ఇచ్చిన ఐశ్వర్య ప్రేమలో పడిందా? లేదా? అన్నది ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందిస్తే గాని క్లారిటీ రాదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శ్రీతేజ కుటుంబానికి అండగా.. తెలంగాణ సర్కార్
పండగ వేళ హాట్ టాపిక్‌గా బ్రహ్మీ..
తెలుగు బిగ్ బాస్‌లోకి దండుపాళ్యం హీరోయిన్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

