AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రణ్‌బీర్ కపూర్‌, ఆలియా .. రూ. 250 కోట్ల లగ్జరీ భవనం చూశారా వీడియో

రణ్‌బీర్ కపూర్‌, ఆలియా .. రూ. 250 కోట్ల లగ్జరీ భవనం చూశారా వీడియో

Samatha J
|

Updated on: Aug 28, 2025 | 5:51 PM

Share

రణ్‌బీర్‌ కపూర్‌ ఆలియా దంపతుల రెండు వందల యాభై కోట్ల రూపాయల విలువ చేసే భవనం ఎట్టకేలకు ముంబైలో రెడీ అయింది. ఆ ఇల్లు రణ్‌బీర్‌ కపూర్‌కు వారసత్వంగా వచ్చింది. తన తాత రాజ్‌కపూర్‌ ఈ ఇంటిని కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఋషి కపూర్‌ అందులోనే ఉన్నారు. ఇప్పుడు రణ్‌బీర్‌ కపూర్‌ చేతికి ఆ ఆస్తి వచ్చింది. అయితే ఇప్పుడు ఆ ఇంటిని రీ మోడలింగ్ చేయించారు. పాత ఇంటి గుర్తులు చెరిగిపోకుండా ఆర్థిక స్థితిని విలాసవంతమైన ఇంటిని నిర్మించారు.

రణ్‌బీర్‌ ఈ ఇంటిని చాలా సెంటిమెంటల్‌గా ఫీల్ అవుతున్నారు. పైగా కూతురు పుట్టిన తర్వాత తనకు ప్రొఫెషనల్ లైఫ్ బాగా కలిసి వచ్చిందని అంటున్నారు. అందుకే దాదాపు రెండు వందల యాభై కోట్లకు పైగా విలువ ఉన్న ఈ భవనాన్ని కూతురు రాహా పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు. త్వరలోనే ఇంట్లోకి అడుగుపెట్టనున్నారు ఆలియాభట్ ఫ్యామిలీ. ఈ దీపావళిని తమ కూతురితో అక్కడ సెలబ్రేట్ చేసుకోవాలని రణ్‌బీర్‌ ప్లాన్ చేస్తున్నారట. ఇక్కడో విషయం చెప్పుకోవాలి. తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తు కోసం డబ్బులు కూడబెడుతుంటారు. పిల్లల చదువులు, కెరియర్‌, వారి పెళ్లి, ఇతర అవసరాలకు ఆ డబ్బు ఉపయోగపడుతుందని పైసా పైసా పోగు చేస్తుంటారు. ఇందుకు సెలబ్రిటీలు ఏమి అతితలు కాదు. తాము సంపాదించిన ఆస్తులన్నింటిని తమ పిల్లలకే అప్పజెపుతారు. అలా ఇటీవల రణ్‌బీర్‌ ఆలియా జంట తమ కూతురికి కోట్ల రూపాయల ఆస్తిని గిఫ్ట్‌గా ఇచ్చారు. కూతురు అలా పుట్టిందో లేదో అప్పుడే ఆ పాప పేరు పైన ఏకంగా వందల కోట్ల విలువైన ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించి రిచెస్ట్‌ స్టార్‌కిడ్‌గా మార్చేశారు. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఉన్న రిచెస్ట్‌ స్టార్‌కిడ్‌ రెండేళ్ల రాహా కపూర్‌ అనే చెప్పొచ్చు. త్వరలోనే వీరు ముంబైలోని బాంద్రా నడిబొడ్డున ఉన్న ఈ కొత్త ఇంట్లోకి షిఫ్ట్ కానున్నారు. ఇక ఈ ఆస్తికి సంరక్షకురాలిగా రణ్‌బీర్‌ కపూర్‌ తల్లి నటి నీతూ కపూర్‌ వ్యవహరిస్తారు.

మరిన్ని వీడియోల కోసం :

ఆటో అన్న.. నీ ఐడియా అదుర్స్.. ఏం చేశాడో తెలిస్తే షాకే వీడియో

చీకట్లో నడిచి వెళ్తున్న రైతు.. ఎదురుగ కనిపించింది చూసి భయంతో వీడియో

తల్లికి రెండో పెళ్లి చేసిన 12 ఏళ్ల కూతురు వీడియో

పాపం దానికి తెల్వదు స్నేహితుడు ఇక లేడని.. కన్నీరు పెట్టిస్తున్న వీడియో