ఆంజనేయుడికి గుడి కడదామని పునాదులు తవ్వుతుండగా అద్భుతం వీడియో
మధ్యప్రదేశ్ లోని మోరిన జిల్లాలో గురువారం ఒక అరుదైన ఘటన వెలుగు చూసింది. గ్రామంలో హనుమాన్ ఆలయ నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు సంకల్పించారు. ఇందుకోసం అందరూ చందాలు వేసుకున్నారు. టెంపుల్ నిర్మాణం కోసం గ్రామ సర్పంచ్ తన పూర్వీకుల నుంచి వచ్చిన భూమిని అందించేందుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలో ఆలయ నిర్మాణ పనుల కోసం పునాదులు తవ్వుతుండగా ఆశ్చర్యకరంగా ప్రాచీన కాలానికి చెందిన బంగారు నాణేలు బయటపడ్డాయి. సగౌరియాపురా గ్రామంలో జరుగుతున్న తవ్వకాల సమయంలో నాణేలు లభించడంతో గ్రామస్తులు ఆశ్చర్యపోయారు.
ఈ వార్త క్షణాల్లో ఊరంతా పాకింది. గ్రామస్తులు అక్కడికి భారీగా చేరుకొని ఆ నాణేలను ఆసక్తిగా పరిశీలించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.సుమారు 50 నుండి 60 బంగారు నాణేలు బయటపడ్డాయని గ్రామ సర్పంచ్ సంతోషీలాల్ ఠాకూర్ తెలిపారు. అయితే పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ రాజేంద్ర పరిహార్ మాత్రం ఇప్పటి వరకు కేవలం 20 నుంచి 25 నాణేలు మాత్రమే స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మొత్తం ఎంత మందికి నాణేలు లభించాయి? ఆ ప్రాంతంలో ఇంకా నాణేలు పాతిపెట్టి ఉన్నాయా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ నాణేల గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి నిపుణులను కూడా పిలిపిస్తున్నారు. అవి నిజంగానే ప్రాచీన కాలానికి చెందినవైతే ఏ శకానికి సంబంధించినవో తెలుసుకోవడానికి పరిశోధన చేపట్టనున్నారు. ఈ నాణేలు బయటపడిన వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అధికారుల నివేదిక కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
ఆటో అన్న.. నీ ఐడియా అదుర్స్.. ఏం చేశాడో తెలిస్తే షాకే వీడియో
చీకట్లో నడిచి వెళ్తున్న రైతు.. ఎదురుగ కనిపించింది చూసి భయంతో వీడియో
తల్లికి రెండో పెళ్లి చేసిన 12 ఏళ్ల కూతురు వీడియో
పాపం దానికి తెల్వదు స్నేహితుడు ఇక లేడని.. కన్నీరు పెట్టిస్తున్న వీడియో
గుడి లేకుండా ధ్వజస్థంభం.. కాని నిరంతరం పూజలు.. ఎక్కడంటే ?
కురుపు అని గిల్లితే.. బయటపడిన బుల్లెట్
మగపిల్లవాడి కోసం ఆ దంపతులు ఏం చేశారో తెలుసా
భార్య వంట చేయడంలేదని కోర్టుకు ఎక్కిన భర్త..
దొంగ ఇంట్లో పోలీసులు చోరీ.. అదే కదా మ్యాజిక్కు
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
