ఇదేంట్రా బాబూ.. డబ్బుల వర్షం కురిపించిన కోతి..! ఏకంగా రూ.500 నోట్లతో..
ఉత్తరప్రదేశ్ లోని ఓ తహశీల్దార్ కార్యాలయంలో ఆకాశం నుంచి డబ్బుల వర్షం కురిసింది. చెట్టుపై నుంచి కోతి డబ్బుల వర్షం కురిపించింది. ఈ వింతను చూసి అక్కడున్న కొందరు పండగ చేసుకోగా డబ్బు పోగొట్టుకున్న బాధితుడు లబోదిబోమన్నాడు. ఓ ప్రైవేటు స్కూల్ టీచర్ రిజిస్ట్రేషన్ పని మీద బిధునా తహశీల్దార్ కార్యాలయానికి వచ్చాడు. తన వెంట బ్యాగులో 80,000 రూపాయల కాష్ ను తెచ్చుకున్నాడు.
ఉత్తరప్రదేశ్ లోని ఓ తహశీల్దార్ కార్యాలయంలో ఆకాశం నుంచి డబ్బుల వర్షం కురిసింది. చెట్టుపై నుంచి కోతి డబ్బుల వర్షం కురిపించింది. ఈ వింతను చూసి అక్కడున్న కొందరు పండగ చేసుకోగా డబ్బు పోగొట్టుకున్న బాధితుడు లబోదిబోమన్నాడు. ఓ ప్రైవేటు స్కూల్ టీచర్ రిజిస్ట్రేషన్ పని మీద బిధునా తహశీల్దార్ కార్యాలయానికి వచ్చాడు. తన వెంట బ్యాగులో 80,000 రూపాయల కాష్ ను తెచ్చుకున్నాడు. ఆఫీసులో ఉండగా ఎక్కడినుంచి వచ్చిందో ఓ కోతి రెప్పపాటులో అతడి బ్యాగులోని 500 రూపాయల నోట్ల కట్టలను లాక్కొని పరుగుతీసింది. అక్కడినుంచి నేరుగా సమీపంలోని చెట్టుపై ఎక్కిన ఆ వానరం కాసేపటికే నోట్ల కట్టలను విప్పి ఒక్కొక్క నోటును కిందకు విసరడం మొదలుపెట్టింది. చెట్టుపై నుంచి 500 రూపాయల నోట్లు రాలడం చూసిన జనం ఆశ్చర్యపోయారు. వెంటనే తేరుకొని దొరికిన నోట్లను దొరికినట్లు ఏరుకున్నారు.
ఈ గందరగోళంలో డబ్బు పోగొట్టుకున్న టీచర్ హుటాహుటిన అక్కడికి చేరుకున్నాడు. తన డబ్బును తిరిగి ఇవ్వమని జనాన్ని బ్రతిమాలాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అందరూ కలిసి ఏరిన డబ్బును లెక్కచూడగా అతనికి 52,000 రూపాయలు మాత్రమే తిరిగి దక్కాయి. మిగిలిన 28,000 అక్కడున్న వారు జేబుల్లో వేసుకొని వెళ్ళిపోయారు. దీంతో ఆ ఉపాధ్యాయుడు తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఈ ప్రాంతంలో కోతుల బెడద చాలా తీవ్రంగా ఉందని గతంలో కూడా ఇలా విలువైన వస్తువులు పత్రాలను లాక్కెళ్ళిన ఘటనలు ఉన్నాయని స్థానికులు వాపోయారు.
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
వాట్సాప్లో హాయ్ అంటే.. FIR కాపీ ఓయ్ అంటుంది
సంక్రాంతికి పల్లెబాట పట్టిన జనం

