పాపం దానికి తెల్వదు స్నేహితుడు ఇక లేడని.. కన్నీరు పెట్టిస్తున్న వీడియో
కుక్కలు విశ్వాసానికి ప్రతిరూపం అంటారు. ఆకలితో ఉన్న కుక్కకు ఇంత అన్నం పెడితే చాలు జీవితాంతం అది తన విశ్వాసాన్ని చూపిస్తుంటుంది. అంతే కాదు తోటి కుక్కల పట్ల కూడా బలమైన భావోద్వేగ అనుబంధంతో కలిసిమెలసి ఉంటాయి. ఈ భావనను హైలైట్ చేసే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన తర్వాత మీ హృదయం కూడా కరిగిపోతుంది. ఈ వీడియో చూసిన తర్వాత భావోద్వేగాలకు జంతువులు కూడా అతీతం కాదంటున్నారు.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ కుక్క రోడ్డుపక్కన ఫుట్‌పాత్ మీద పడిపోయి ఉంది. మరో కుక్క తన సహచరుడిని లేపడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంది. ఎంత లేపినా ఎటువంటి ఆ కుక్క చలనం లేకుండా పడి ఉండటంతో ఆందోళన చెందింది. కాళ్లతో తడుముతూ తన సహచర కుక్కను లేపడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అయినా ఆ శునకం లేవకపోవడంతో నిస్సహాయంగా చూస్తుండిపోయింది. పాపం ఆ మూగజీవికి అర్ధం కాలేదు తన సహచరి ఇక లేదని.. ఇంతలో ఎవరో అక్కడికి వచ్చినట్లు అలికిడి కావడంతో దూరంగా జరిగింది. ఆ తర్వాత దానికి అర్ధమైనట్టుంది తన సహచర శునకం ఇక లేదని.. భారంగా అక్కడినుంచి కదిలింది. దీనిపై నెటిజన్స్ ఎమోషనల్‌గా స్పందిస్తున్నారు. ఈ దృశ్యం నిజంగా చాలా హృదయ విదారకంగా ఉందని, దానిని చూసిన తర్వాత నాకు నిజంగా ఏడుపొచ్చిందని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. అదే సమయంలో, కుక్కలు తమ భాగస్వాములకు చాలా విశ్వాసపాత్రంగా ఉన్నాయని ఈరోజే నాకు తెలిసిందని మరొకరు రాశారు.
మరిన్ని వీడియోల కోసం :
ఖైరతాబాద్ గణపతిని చూశారా?వీడియో
తాత నువ్వు కేక.! ఇలా కూడా వ్యాపారం చేయొచ్చా?వీడియో
కొడుకు ప్రాణాల కోసం.. మొసలితో తల్లి ఫైటింగ్ వీడియో
తాత చేసిన పనితో.. అంతులేని సంపద మనవడి సొంతం..!
వామ్మో.. వీడి ట్యాలెంట్ చూసి పోలీసులే షాక్ అయ్యారు..!
మలంతో లక్షల సంపాదన.. ప్రాణాలు కాపాడుతున్న యువకుడు!
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్

