AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్రామ సింహం Vs‌ చిరుతపులి.. గెలుపు ఎవరిదో తెలుసా?

గ్రామ సింహం Vs‌ చిరుతపులి.. గెలుపు ఎవరిదో తెలుసా?

Samatha J
|

Updated on: Aug 27, 2025 | 1:17 PM

Share

మహారాష్ట్రలోని నాసిక్‌లో ఓ షాకింగ్‌ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వీధి శునకం చిరుతపులిని పరుగులు పెట్టించింది. అర్ధరాత్రి గ్రామంలో చొరబడిన చిరుతను నోట కరచుకొని ఏకంగా 300 మీటర్ల దూరం లాక్కెళ్లింది. ఈ ఘటన నాసిక్‌లోని నిఫాడ్‌లో జరిగింది. దీనికి సంబందించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

చిరుతలకు అడవి పందుల తర్వాత ప్రధాన ఆహారం కుక్కలు. అడవుల్లో ఆహారం దొరక్క గ్రామాల్లోకి చొరబడుతున్నాయి. ఇళ్లలో పెంచుకునే పెంపుడు కుక్కలు, వీధుల్లో తిరిగే కుక్కల కోసం గ్రామాల్లోకి వస్తూ దొరికిన జంతువును చంపి తింటున్నాయి. ఈ క్రమంలో నాసిక్‌లోని నిఫాడ్‌ గ్రామంలోకి అర్ధరాత్రి ఓ చిరుతపులి వచ్చింది. అక్కడే ఉన్న ఓ వీధి శునకం దాన్ని అడ్డుకుంది. దాంతో తీవ్రంగా పోరాడింది. అకస్మాత్తుగా వీధి కుక్క దూకుడుగా చిరుతపై దాడి చేసిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అది తప్పించుకునేలోపు కుక్క చిరుతను నోట కరచుకొని చాలా దూరం లాక్కెళ్లిందన్నారు. తీవ్రంగా గాయపడిన చిరుత చివరికి కుక్క నుంచి తప్పించుకొని బతుకు జీవుడా అంటూ సమీపంలోని పొలాల్లోకి పారిపోయిందన్నారు. చిరుత కారణంగా స్థానికులకు ఎలాంటి హానీ జరగలేదని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత కొంతకాలంగా నాసిక్ జిల్లా నిఫాడ్ తాలూకాలో చిరుతపులి సంచరిస్తోంది. ఈ క్రమంలోనే చిరుత.. వీధికుక్క కంటపడింది. ఇప్పుడు వీధి కుక్కల అంశంపైపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ సంఘటన జరగడం విశేషం.

మరిన్ని వీడియోల కోసం :

ఖైరతాబాద్‌ గణపతిని చూశారా?వీడియో

తాత నువ్వు కేక.! ఇలా కూడా వ్యాపారం చేయొచ్చా?వీడియో

కొడుకు ప్రాణాల కోసం.. మొసలితో తల్లి ఫైటింగ్‌ వీడియో

Published on: Aug 27, 2025 01:16 PM