వింత ఘటన.. నీలం రంగులో గుడ్డు పెట్టిన నాటు కోడి వీడియో
సాధారణంగా కోడిగుడ్డు తెలుపు రంగులో ఉంటుంది. కొన్ని బ్రౌన్‌కలర్‌లో ఉండే గుడ్లు కూడా ఉంటాయి. కానీ నీలం రంగులో ఉండే కోడి గుడ్డును ఎప్పుడైనా చూశారా? కర్ణాటకలోని ఓ చిన్న గ్రామంలో జరిగిన ఈ విచిత్ర సంఘటన ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. దావణగెరె జిల్లా, చన్నగిరి తాలూకాలోని నల్లూరు గ్రామంలో ఓ సాధారణ నాటు కోడి నీలం రంగులో ఉన్న గుడ్డు పెట్టింది. ఈ వింత గుడ్డును చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు.
నల్లూరు గ్రామానికి చెందిన సయ్యద్ నూర్ అనే రైతు జీవనోపాధి కోసం పది నాటు కోళ్లను పెంచుకుంటున్నాడు. వాటిలో ఒక కోడి తాజాగా నీలం రంగు గుడ్డు పెట్టడంతో ఆయన ఆశ్చర్యపోయారు. సాధారణంగా తెలుపు గుడ్లను చూసే ఆ ఊరి ప్రజలకు ఈ నీలం గుడ్డు ఓ అద్భుతంగా కనిపించింది. దీంతో ఈ విషయం ఊరంతా పాకి ఆ కోడి, దాని గుడ్డు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. ఈ వింత గుడ్డుపై సమాచారం అందుకున్న చన్నగిరి తాలూకా పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ అశోక్ నేతృత్వంలోని బృందం గ్రామానికి చేరుకుంది. వారు ఆ కోడిని, గుడ్డును క్షుణ్ణంగా పరిశీలించారు. కొన్ని జాతుల కోళ్లలో ఉండే ‘బైలివెర్డిన్’ అనే వర్ణద్రవ్యం కారణంగా గుడ్డు పెంకుకు నీలం లేదా ఆకుపచ్చ రంగు వస్తుందని డాక్టర్ అశోక్ వివరించారు. ఇది చాలా అరుదుగా జరుగుతుందని, అయితే గుడ్డు రంగు మారినా దానిలోని పోషక విలువల్లో ఎలాంటి మార్పు ఉండదని ఆయన స్పష్టం చేశారు.
మరిన్ని వీడియోల కోసం :
దారుణం.. పెళ్లయిన మూడు నెలలకే భార్యను చంపి..ప్రియురాలితో వీడియో
ఇక శ్వాస పరీక్ష ద్వారా.. మధుమేహం గుట్టు రట్టు వీడియో
ఆలస్యంగా తల్లి కావాలనుకునే వారికి ఇది వరం.. వీడియో
వైకల్యాన్ని జయించి మద్రాస్ ఐఐటీలో సీటు సాధించి..
దోమతెర కప్పుకుందామని తీసిన యువకుడు.. కాలికి తాకిన దానిని చూసి
వాచ్మెన్ రూంలో వింత శబ్దాలు.. వెళ్లి చూస్తే.. గుండె జారిపోయింది
ఏంది సామీ ఇదీ.. మీరు డాక్టర్లా..మంత్రగాళ్లా..!
ఆ సరిహద్దుల్లోకి వెళ్లకండి.. చాటింపు వేసి చెబుతున్న అధికారులు
కాకినాడలో లవ్ జీహాద్ కలకలం.. ఒకరితో పెళ్లి.. ఆరుగురితో సహజీవనం
అమెరికాలో తెలుగు పెళ్లి.. ఆన్లైన్లోనే పెద్దల ఆశీస్సులు!

