డబ్బు వర్షం కురిపించిన కోతి..! ఏకంగా రూ.500 నోట్ల కట్టతో
ఉత్తరప్రదేశ్‌లోని ఓ తహసీల్దార్ కార్యాలయంలో ఆకాశం నుంచి డబ్బుల వర్షం కురిసింది. చెట్టుపై నుంచి కోతి డబ్బుల వర్షం కురిపించింది. ఈ వింతను చూసి అక్కడున్న కొందరు పండగ చేసుకోగా, డబ్బు పోగొట్టుకున్న బాధితుడు మాత్రం లబోదిబోమన్నాడు. ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్, రిజిస్ట్రేషన్ పని మీద బిధున తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాడు.
తన వెంట బ్యాగులో 80,000 రూపాయల క్యాష్ ను తెచ్చుకున్నాడు. ఆఫీసులో ఉండగా, ఎక్కడినుంచి వచ్చిందో ఓ కోతి రెప్పపాటులో అతడి బ్యాగులోని 500 రూపాయల నోట్ల కట్టను లాక్కొని పరుగు తీసింది. అక్కడి నుంచి నేరుగా సమీపంలోని ఓ చెట్టుపైకి ఎక్కిన ఆ వానరం, కాసేపటికి నోట్ల కట్టను విప్పి ఒక్కొక్క నోటును కిందకు విసరడం మొదలుపెట్టింది. చెట్టు పైనుంచి 500 రూపాయల నోట్లు రాలడం చూసిన జనం ఆశ్చర్యపోయారు. వెంటనే తేరుకుని దొరికిన నోట్లను దొరికినట్టు ఏరుకున్నారు. ఈ గందరగోళంలో, డబ్బు పోగొట్టుకున్న టీచర్ హుటాహుటిన అక్కడికి చేరుకున్నాడు. తన డబ్బును తిరిగి ఇవ్వమని జనాన్ని బ్రతిమాలాడు. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అందరూ కలిసి ఏరిన డబ్బును లెక్క చూడగా, అతనికి 52 వేల రూపాయలు మాత్రమే తిరిగి దక్కాయి. మిగిలిన 28 వేలు అక్కడున్న వారు జేబుల్లో వేసుకుని వెళ్లిపోయారు. దీంతో ఆ ఉపాధ్యాయుడు తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఈ ప్రాంతంలో కోతుల బెడద చాలా తీవ్రంగా ఉందని, గతంలో కూడా ఇలా విలువైన వస్తువులు, పత్రాలను లాక్కెళ్లిన ఘటనలు ఉన్నాయని స్థానికులు వాపోయారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ట్రంప్ కుడిచేతి వెనుక తెల్లటి మచ్చ..అమెరికా అధ్యక్షుడి ఆరోగ్యంపై
శరీర మాంసాన్ని తినే ఈగ లార్వాలు ఈ భయానక వ్యాధితో చాలా డేంజర్
మెట్రో ట్రాక్‌పై పడిపోయిన సెక్యూరిటీ గార్డు.. క్షణాల్లోనే
17వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. నాలుగో కాన్పు అని అబద్ధం
మూడు నెలల్లో పదిమంది పుస్తెలతాళ్ళు తెంచుకుపోయాడు.. ఎందుకో తెలిస్తే
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

