శరీర మాంసాన్ని తినే ఈగ లార్వాలు ఈ భయానక వ్యాధితో చాలా డేంజర్
మానవ శరీరంలో మాంసాన్ని తినేసే ప్రమాదకరమైన పరాన్నజీవికి సంబంధించిన తొలి కేసు అమెరికాలో నమోదైంది. మేరీలాండ్‌లో ఓ వ్యక్తి దీని బారిన పడ్డారు. ఎల్‌సాల్వెడార్ దేశం నుంచి వచ్చిన వ్యక్తికి అక్కడే వ్యాధి సోకినట్లు డాక్టర్లు తెలిపారు. అక్కడి పాడి పశువుల్లో ఉన్న ఈ వ్యాధి ఆ వ్యక్తికి సోకింది. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ CDC సహకారంతో తొలి కేసును యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ నిర్థారించింది.
ఈ వ్యాధిని న్యూ వరల్డ్ screw worm డిసీజ్‌గా పిలుస్తున్నారు. ప్రధానంగా శరీరంపై పుండ్లు, గాయాలు ఉన్నవారికి మియాసిస్ సోకే అవకాశాలు ఎక్కువ. ఓ ప్రత్యేక జాతికి చెందిన ఈగ.. పుండ్లపై తిష్టవేసి గుడ్లు పెడుతుంది. గుడ్లు క్రమంగా లార్వాలుగా మారగా ఆ లార్వాలు మాంసాన్ని తినేస్తాయి. ఆ సమయంలో తీవ్రమైన నొప్పి కలుగుతుంది. సరైన చికిత్స తీసుకోకపోతే ప్రాణాపాయం తప్పదు. మియాసిస్ ప్రభావానికి గురైన పశువుల నుంచి మనుషులు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ముల్లును ముల్లుతోనే తీయాలి అన్నట్లుగా ఈగల్లో సంతానాన్ని అరికట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి ఆ యా దేశాలు. స్టెరిలైజ్ చేసిన మగ ఈగలతో ఆడ ఈగలు కలిసేలా చేసి.. ఆ ఆడ ఈగల్లో సంతాన సామర్థ్యం క్షీణించేలా చేస్తున్నారు. గాయాలు, పుండ్లు మానేలా మనుషులు జాగ్రత్తపడితే ఆ ఈగల బారినపడే అవకాశాలు ఉండవని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మెట్రో ట్రాక్‌పై పడిపోయిన సెక్యూరిటీ గార్డు.. క్షణాల్లోనే
17వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. నాలుగో కాన్పు అని అబద్ధం
మూడు నెలల్లో పదిమంది పుస్తెలతాళ్ళు తెంచుకుపోయాడు.. ఎందుకో తెలిస్తే
అది ఏలియన్ నౌకా.. తోకచుక్కా..
చడీచప్పుడు కాకుండా ప్రియుడితో ఎంగేజ్‌మెంట్.. షాకిచ్చిన హీరోయిన్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

