AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అది ఏలియన్‌ నౌకా.. తోకచుక్కా..

అది ఏలియన్‌ నౌకా.. తోకచుక్కా..

Phani CH
|

Updated on: Aug 29, 2025 | 3:33 PM

Share

సౌర వ్యవస్థలో వేగంగా దూసుకొస్తున్న ఓ రహస్య వస్తువుపై కొంతకాలంగా జరుగుతున్న ఊహాగానాలకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తెరదించింది. అది గ్రహాంతరవాసుల వ్యోమనౌక కాదని, అదొక సహజసిద్ధమైన తోకచుక్క అని స్పష్టం చేసింది. 3I/ATLAS అని పేరుపెట్టిన ఈ వస్తువుపై జరిపిన లోతైన పరిశీలనలో కీలక విషయాలు వెల్లడయ్యాయి.

ఈ ఏడాది జూలై 1న చిలీలోని అట్లాస్ సర్వే ఈ తోకచుక్కను మొదటిసారిగా గుర్తించింది. సౌర వ్యవస్థలోకి ప్రవేశించిన ఖగోళ వస్తువుగా దీనిని శాస్త్రవేత్తలు ధృవీకరించారు. దీనికి ముందు 2017లో ‘ఓమువామువా’, 2019లో ‘బోరిసోవ్’ అనే రెండు వస్తువులను కనుగొన్నారు. 3I/ATLAS తన హైపర్‌బోలిక్ కక్ష్యలో అత్యంత వేగంగా ప్రయాణిస్తున్నప్పటికీ, భూమికి 1.8 ఏయూ ఆస్ట్రానామికల్ యూనిట్లు (AU) కంటే దగ్గరగా రాదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ వస్తువుపై నెలకొన్న సందేహాలను నివృత్తి చేసేందుకు నాసా తన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌ను రంగంలోకి దించింది. దానిలోని నియర్-ఇన్‌ఫ్రారెడ్ స్పెక్ట్రోగ్రాఫ్ (NIRSpec) సాయంతో ఈ తోకచుక్క రసాయన కూర్పును విశ్లేషించారు. ఇందులో నీటి మంచు, కార్బన్ మోనాక్సైడ్‌తో పాటు అత్యధిక స్థాయిలో కార్బన్ డైఆక్సైడ్ ఉన్నట్లు కనుగొన్నారు. ఈ అధిక కార్బన్ డైఆక్సైడ్ వాయువు కారణంగానే తోకచుక్క నుంచి పదార్థాలు బయటకు వెలువడుతూ ప్రకాశవంతమైన తోక ఏర్పడుతోందని, ఇది కృత్రిమంగా ఏర్పడింది కాదని స్పష్టం చేశారు. గతంలో ఆస్ట్రోఫిజిసిస్ట్ ఆవి లోబ్ సహా కొందరు ఇది గ్రహాంతరవాసుల వ్యోమనౌక లేదా న్యూక్లియర్ శక్తితో నడిచే వస్తువు కావచ్చని అంచనా వేయడంతో దీనిపై తీవ్ర చర్చ జరిగింది. అయితే, నాసాతో పాటు ఇతర అంతరిక్ష పరిశోధన సంస్థలు ఈ వాదనలను ఖండించాయి. దీని రసాయన కూర్పు, కక్ష్య, ప్రకాశవంతంగా కనిపించడానికి గల కారణాలను విశ్లేషించిన తర్వాత, ఇది మరో నక్షత్ర మండలం నుంచి విసిరేయబడిన ఒక సహజ తోకచుక్క మాత్రమేనని తేల్చాలు శాస్త్రవేత్తలు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చడీచప్పుడు కాకుండా ప్రియుడితో ఎంగేజ్‌మెంట్.. షాకిచ్చిన హీరోయిన్

జియో,ఎయిర్‌టెల్‌కు BSNL షాక్..

నా భార్య తిరిగొచ్చింది.. కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్ భర్త..

కోనేరు కనిపిస్తే దిగడమేనా? పద్ధతీ పాడూ లేదా? ఆలయంలో అపచారం

శరీరం తప్ప ఇంకేం కనిపించదా మీకు ?? మా బాధ అర్థం కాదు కదా.. హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్