కోనేరు కనిపిస్తే దిగడమేనా? పద్ధతీ పాడూ లేదా? ఆలయంలో అపచారం
కేరళలోని ప్రముఖ ఆలయమైన గురువాయూర్ ఆలయంలో బిగ్ బాస్ మలయాళం మాజీ కంటెస్టెంట్ జాస్మిన్ జాఫర్ చేసిన ఒక పని తీవ్ర విమర్శలకు దారి తీసింది. సంప్రదాయ చీర ధరించి ఆలయంలోకి వెళ్లిన ఆమె అక్కడ పవిత్ర కొనేరులో తన కాళ్లను కడుక్కుంటూ వీడియో తీసుకుంది. తీసుకోవాడమే కాదు ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అంతే.. ఒక్కసారిగా ఈ వీడియో సోషల్ వీడియోలోనే వైరల్ గా మారింది. దీంతో కేరళలోని హిందూ మత పెద్దలు, నెటిజన్లు జాస్మిన్ జాఫర్ పై మండిపడుతున్నారు. ఆలయ నిబంధనలను ఆమె తుంగలో తొక్కిందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే జాస్మిన్ రియాక్టైనప్పటికీ ఈ వివాదం కాస్తా ఇప్పుడు మరో లెవెల్‌కు వెళ్లేలా కనిపిస్తోంది. ఆ ఆలయ సాంప్రదాయం ప్రకారం.. విగ్రహామూర్తులకు ఈ పవిత్ర కొలనులో స్నానం చేయిస్తుంటారు. ఈ కొలనులోకి వెళ్లడానికి భక్తులకు అనుమతి లేదు. అంతేకాదు గురువాయూర్ ఆలయం కోనేరులో పాదాలను కడుక్కోకూడదని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది కూడా..! కానీ ఇదేమీ తెలియని జాస్మిన్ జాఫర్ ఈ ఆలయ కొలనులో తన కాళ్లను ఆడిస్తూ ఓ రీల్‌ను షూట్ చేసి.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. ఆలయ నిర్వాకుల కంట పడింది. దీంతో వారితో పాటు.. హిందూ నాయకులు భగ్గుమన్నారు. అయితే తన వీడియోపై తీవ్ర విమర్శలు రావడంతో జాస్మిన్ స్పందించింది. వెంటనే తన ఖాతా నుంచి కాంట్రవర్సీ వీడియోను డిలీట్ చేసింది. అలాగే తన వీడియో పట్ల అందరికీ క్షమాపణలు చెప్పింది. తనకు ఈ ఆంక్షల గురించి తెలియదని, ఎవరినీ బాధపెట్టాలని లేదా వివాదం సృష్టించాలన్న ఉద్దేశం లేదని జాస్మిన్ పేర్కొంది. జాస్మిన్ జాఫర్ చేసిన పని వల్ల ఆలయ పవిత్రతకు భంగం కలిగిందని భావించి, ఆగస్టు 26 నుంచి ఆరు రోజుల పాటు శుద్ధి కార్యక్రమాలు చేపట్టాలని దేవస్థానం బోర్డు నిర్ణయించింది. ఆలయంలో భక్తుల దర్శనాలపై కూడా ఆంక్షలు విధించారు. ఆలయ నిబంధనలను ఉల్లంఘించినందుకు జాస్మిన్ జాఫర్‌పై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శరీరం తప్ప ఇంకేం కనిపించదా మీకు ?? మా బాధ అర్థం కాదు కదా.. హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్
బన్నీ టీంలో హాలీవుడ్ మార్కెటింగ్ హెడ్! మనోడి రేంజ్ ఊహించనంత ఎత్తుకే
వరదలో చిక్కుకున్న స్టార్ హీరో.. సాయం కోసం ఎదురుచూపులు
తప్పతాగి.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని బెదిరించి.. పరారైన స్టార్ హీరోయిన్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

