నా భార్య తిరిగొచ్చింది.. కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్ భర్త..
హీరోయిన్స్ లైఫ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. నిత్యం షూటింగ్స్ తో బిజీగా ఉండే హీరోయిన్స్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి అస్సలు సమయం దొరకదు. అందులోనూ వాళ్లు కమిట్ అయిన సినిమా షూటింగ్స్ కారణంగా.. నెలల తరబడి కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో తన భార్య తనకు దూరంగా ఉందంటూ.. ఒంటరి తనాన్ని భరించలేకపోతున్నా.. అంటూ ఓ హీరోయిన్ భర్త ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు.
ఆయన ఎవరో కాదు.. హీరోయిన్ పూర్ణ భర్త షానిద్ అసిఫ్. హీరోయిన్‌గా మలయాళం నుంచి టాలీవుడ్ లో అడుగుపెట్టిన పూర్ణ.. హీరోయిన్ గా సినిమాలు చేసింది. ఆ తర్వాత పెళ్లి కారణంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ…. రీసెంట్‌గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. ఫ్యామిలీకి టైం ఇవ్వలేని పరిస్థితి చేరుకుంది. దీంతో తన భర్త షానిద్ అలీ.. ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. ఈ 45 రోజుల్లో తనకు ప్రేమ గొప్పదనం ఏంటో తెలిసొచ్చిందంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. మనల్ని ప్రేమించేవారు మనతో ఉండటమే జీవితంలో అన్నిటికంటే గొప్ప వరం అని నాకు అర్ధమైంది. ఈరోజు నా భార్య నా దగ్గరకు తిరిగొచ్చేసింది. ఎన్నో ఎదురుచూపుల తర్వాత నా భార్యను కలవడంతో నాకు ఆనందభాష్పాలు వస్తున్నాయి అంటూ రాసుకొచ్చాడు షానిద్. అయితే ఈ పోస్ట్ ను కొంతమంది తప్పుగా తీసుకున్నారు. వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయని అనుకున్నారు. దీనిపై ఆయన క్లారిటీ కూడా ఇచ్చారు. నా భార్య 20 రోజులు చెన్నైలో, 15 రోజులు మలప్పురంలో, ఆ తర్వాత జైలర్ 2 మూవీ కోసం అక్కడ తనింట్లో ఉంది. అంటే మొత్తం 45 రోజులు నాకు దూరంగా ఉంది. పెళ్ళైన ఇన్నేళ్ళలో మేము ఎప్పుడూ ఇంత దూరంగా లేము అంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కోనేరు కనిపిస్తే దిగడమేనా? పద్ధతీ పాడూ లేదా? ఆలయంలో అపచారం
శరీరం తప్ప ఇంకేం కనిపించదా మీకు ?? మా బాధ అర్థం కాదు కదా.. హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్
బన్నీ టీంలో హాలీవుడ్ మార్కెటింగ్ హెడ్! మనోడి రేంజ్ ఊహించనంత ఎత్తుకే
వరదలో చిక్కుకున్న స్టార్ హీరో.. సాయం కోసం ఎదురుచూపులు
తప్పతాగి.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని బెదిరించి.. పరారైన స్టార్ హీరోయిన్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

