శరీరం తప్ప ఇంకేం కనిపించదా మీకు ?? మా బాధ అర్థం కాదు కదా.. హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్
గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్న అమ్మాయిలకు ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. దానికి తోడు సోషల్ మీడియాలో పొగడ్తలతో పాటు.. బాడీషేమింగ్ కామెంట్స్ కూడా ఎదురవుతుంటాయి. అయితే కొంత మంది హీరోయిన్లు ఈ కామెంట్స్‌ను లైట్ తీసుకుంటే.. మరికొంత మంది మాత్రం కాస్త మైండ్‌కు ఎక్కించుని బాధపడుతుంటారు.
అలాంటి కామెంట్స్ తమను ఏ రేంజ్‌లో బాధపెట్టాయనేది తమ పోస్టుల రూపంలో కన్వే చేస్తుంటారు. ఇక హీరోయిన్ మంజుమ మోహన్ అదే చేశారు. కాస్త ఘాటుగా.. కాస్త ఎమోషనల్‌గా.. తనను బాడీ షేమింగ్ చేసిన నెటిజన్లకు ఇచ్చిపడేశారు. మొన్నటి వరకు మలయాళంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న మంజిమా..కోలీవుడ్ స్టార్ గౌతమ్ కార్తీక్‌ను 2022లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది. ఈ క్రమంలో తన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు కొందరు నెటిజన్లు తన శరీరాకృతిపై కామెంట్లు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మంజిమా మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. నేను బరువు తగ్గితే నాకు ఆఫర్స్ వస్తాయి. కానీ జీవితానికి అది ముఖ్యం కాదు. హీరోయిన్స్‌ను బాడీ షేమింగ్ చేసేవారు శరీరం తప్ప ఇంకేమీ కనిపించవా.? సినిమా అనేది నా జీవితంలో ఒక భాగం మాత్రమే.. నాకు ఇంకా ఎన్నో ఆశయాలు ఉన్నాయి. బరువు పెరగడం వల్ల శారీరకంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డానని మంజిమ చెప్పారు. ఇక ఈ నొప్పిని తట్టుకునే ఓపిక తనకు లేదని మంజిమ చెప్పుకొచ్చారు. అలాగే బరువు తగ్గడానికి సర్జరీ చేయించుకోవాలనుకున్నా.. ప్రతి ఒక్కరూ హెల్దీగా, ఫిట్‌గా ఉండాలనే అనుకుంటారు. అయితే కొందరు సహజ సిద్ధంగానే లావుగా ఉంటారు. ఈ విషయంలో వారిని ఏ మాత్రం తప్పుపట్టలేం. అందువల్ల దయచేసి ఒకరి శరీరాకృతిపై కామెంట్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి అంటూ కామెంట్ చేశారు ఈమె.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బన్నీ టీంలో హాలీవుడ్ మార్కెటింగ్ హెడ్! మనోడి రేంజ్ ఊహించనంత ఎత్తుకే
వరదలో చిక్కుకున్న స్టార్ హీరో.. సాయం కోసం ఎదురుచూపులు
తప్పతాగి.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని బెదిరించి.. పరారైన స్టార్ హీరోయిన్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

