బన్నీ టీంలో హాలీవుడ్ మార్కెటింగ్ హెడ్! మనోడి రేంజ్ ఊహించనంత ఎత్తుకే
పుష్ప, పుష్ప 2 సినిమాలతో అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయిన ఈ టాలీవుడ్ స్టార్ హీరో ఇప్పుడు పాన్ వరల్డ్ ఇమేజ్ పై దృష్టి సారించాడు. అందుకే ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో ఓ సూపర్ హీరో తరహా మూవీలో నటిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ అందాల తార దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది.
ఈ క్రేజీ ప్రాజెక్టు కోసం ప్రముఖ హాలీవుడ్ ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే హాలీవుడ్ పవర్ హౌస్ గా పిలువబడే అలెగ్జాండ్రా విక్సోంటి కూడా ఈ మూవీ టీంలో జాయిన్ అయ్యారు. దీంతో ఈమె ఎవరంటూ బన్నీ ఫ్యాన్స్ ఇంటర్ నెట్‌లో తెగ సెర్చ్ చేస్తున్నారు. అల్లు అర్జున్- అట్లీ ప్రాజెక్టును అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ చేయడానికి హాలీవుడ్ స్టూడియోలతో ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే హాలీవుడ్ ప్రముఖ మార్కెటింగ్ ఏజెన్సీ కనెక్ట్ మాబ్ సీన్, అల్లు అర్జున్ సినిమా కోసం పనిచేయనుంది. ఈ ఏజెన్సీకి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ క్రియేటివ్ కంటెంట్‌గా ‘అలెగ్జాండ్రా విస్కోంటి’ పనిచేస్తున్నారు. రీసెంట్‌గా ఫస్ట్ టైం ఇండియాకు వచ్చిన ఈమె.. ముంబైలో అల్లు అర్జున్, అట్లీని కలుసుకున్నారు. ఈ మూవీని అంతర్జాతీయ స్థాయిలో ప్రమోషన్ చేయడంపై చర్చలు నిర్వహించారు. ఇక ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే.. అలెగ్జాండ్రాకి హాలీవుడ్‌లో మంచి గుర్తింపు ఉంది. ఆమె గతంలో ‘అవతార్’, ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’, ‘డ్యూన్’, ‘జురాసిక్ వరల్డ్’, ‘బార్బీ’ వంటి భారీ బడ్జెట్ బ్లాక్‌బస్టర్ చిత్రాల మార్కెటింగ్ బాధ్యతలు చూసింది. ఈ క్రమంలో ఈమె అల్లు అర్జున్-అట్లీ మూవీని హాలీవుడ్‌లో మార్కెటింగ్ చేయనున్నారట. అమెరికా, మెక్సికో, కెనడా, హాలీవుడ్ ప్రభావం ఉన్న ఇతర దేశాలలో అల్లు అర్జున్-అట్లీ చిత్రాన్ని అలెగ్జాండ్రా ప్రమోట్ చేయనున్నారు.దీంతో అల్లు అర్జున్ – అట్లీ మూవీ ఇంటర్నేషనల్ రేంజ్లో సత్తా చాటడం పక్కా అనే కామెంట్ వస్తోంది ఇప్పటి నుంచే..!
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వరదలో చిక్కుకున్న స్టార్ హీరో.. సాయం కోసం ఎదురుచూపులు
తప్పతాగి.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని బెదిరించి.. పరారైన స్టార్ హీరోయిన్
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

