17వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. నాలుగో కాన్పు అని అబద్ధం
వైద్య శాస్త్రానికే సవాల్ విసిరే ఓ వింత ఘటన రాజస్థాన్‌లో జరిగింది. ఉదయ్‌పూర్‌కు చెందిన 55 ఏళ్ల రేఖా గల్బేలియా ఇటీవల తన 17వ బిడ్డకు జన్మనిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వయసులో ప్రసవం జరగడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. రేఖకు ఇదివరకే 16 మంది పిల్లలు పుట్టారు. అయితే వారిలో నలుగురు కుమారులు, ఒక కుమార్తె పుట్టిన కొద్దికాలానికే మరణించారు.
ప్రస్తుతం జీవించి ఉన్న పిల్లల్లో ఐదుగురికి వివాహాలై, వారికి కూడా పిల్లలు ఉన్నారు. తామంతా చాలా కష్టాలు పడ్డామని రేఖ కుమార్తె షీలా చెప్పింది. తన తల్లికి ఇంతమంది పిల్లలని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారని తెలిపింది. రేఖ కుటుంబం తీవ్ర పేదరికంలో జీవనం సాగిస్తోంది. పాత సామాన్లు అమ్ముకుని పూట గడుపుతున్నారు. వారికి సొంత ఇల్లు కూడా లేదు. పిల్లలను పోషించడం కోసం పడుతున్న కష్టాలను రేఖ భర్త కవ్రా వివరించారు. పిల్లల కడుపు నింపడానికి 20 శాతం వడ్డీకి అప్పులు చేయాల్సి వచ్చిందనీ లక్షల రూపాయలు తిరిగి చెల్లించినా వడ్డీ ఇంకా తీరలేదని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ పథకం కింద ఇల్లు మంజూరైనా అది తమకు దక్కలేదని ఆయన వాపోయారు. పీఎం ఆవాస్ యోజన కింద ఇల్లు మంజూరైనా నిరాశ్రయులుగానే ఉన్నామనీ తిండికి, పెళ్లిళ్లకు, చదువులకు తమ దగ్గర సరిపడా డబ్బుల్లేవనీ ఈ సమస్యలు ప్రతిరోజూ వేధిస్తున్నాయని కవ్రా తెలిపారు. ఆసుపత్రిలో చేర్పించినప్పుడు కుటుంబ సభ్యులు వైద్యులకు తప్పుడు సమాచారం ఇచ్చారని ఝాడోల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గైనకాలజిస్ట్ డాక్టర్ రోషన్ దరంగి తెలిపారు. రేఖను ఆసుపత్రిలో చేర్పించినప్పుడు ఇది ఆమెకు నాలుగో కాన్పు అని కుటుంబ సభ్యులు చెప్పారనీ ఆ తర్వాత ఇది 17వ కాన్పు అని తేలిందని ఆయన అన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మూడు నెలల్లో పదిమంది పుస్తెలతాళ్ళు తెంచుకుపోయాడు.. ఎందుకో తెలిస్తే
అది ఏలియన్ నౌకా.. తోకచుక్కా..
చడీచప్పుడు కాకుండా ప్రియుడితో ఎంగేజ్‌మెంట్.. షాకిచ్చిన హీరోయిన్
జియో,ఎయిర్‌టెల్‌కు BSNL షాక్..
నా భార్య తిరిగొచ్చింది.. కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్ భర్త..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

