మెట్రో ట్రాక్‌పై పడిపోయిన సెక్యూరిటీ గార్డు.. క్షణాల్లోనే
మెట్రో ట్రాక్ పై నడుచుకుంటూ వెళ్లకూడదు, దాటకూడదు. అలా దాటితే జరిమానా చెల్లించాలని ప్రతి స్టేషన్‌లో ఎనౌన్స్‌మెంట్ వినపడుతుంది. కానీ దురదృష్టవశాత్తూ మెట్రో ట్రాక్‌పై గార్డు పడిపోయిన హృదయ విదారక ఘటన బెంగళూరులో జరిగింది. డ్యూటీలో ఉన్న ఒక సెక్యూరిటీ గార్డు మెట్రో ట్రాక్‌పై పడిపోయాడు.
ఓవర్ టైమ్ డ్యూటీ చేయడంతోనే అతడు నిద్రమత్తులోకి జారుకుని, ఎటు నడుస్తున్నాడో గమనించక ట్రాక్‌పై పడినట్లు అధికారులు గుర్తించారు. రాగిగూడ మెట్రో స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ సెక్యూరిటీ గార్డు నిద్ర మత్తులో ట్రాక్‌పై పడిపోయాడు. అయితే వెంటనే తేరుకుని ప్లాట్‌ఫామ్‌పైకి ఎక్కే ప్రయత్నం చేయగా, ఓ ప్రయాణికుడు గమనించి అతడిని పైకి లాగాడు. 16 గంటల నిరంతర డ్యూటీ చేయడంతోనే అతడు అలసటతో నిద్రమత్తులోకి జారుకున్నాడని అధికారులు గుర్తించారు. అదృష్టవశాత్తూ, ఎటువంటి పెద్ద ప్రమాదం జరగలేదు. అయితే ఆ CCTV ఫుటేజ్ వైరల్‌గా మారింది. నిరంతరంగా 16 గంటలు పనిచేయడం వల్ల డీహైడ్రేషన్, అలసట, గుండెజబ్బు సమస్యలు రావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సమయానుకూల విశ్రాంతి ఇవ్వడం అవసరమని సూచిస్తున్నారు. సిబ్బంది పని గంటలను సమీక్షించడంతో పాటు వారి ఆరోగ్యంపై మెట్రో అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనీ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
17వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. నాలుగో కాన్పు అని అబద్ధం
మూడు నెలల్లో పదిమంది పుస్తెలతాళ్ళు తెంచుకుపోయాడు.. ఎందుకో తెలిస్తే
అది ఏలియన్ నౌకా.. తోకచుక్కా..
చడీచప్పుడు కాకుండా ప్రియుడితో ఎంగేజ్‌మెంట్.. షాకిచ్చిన హీరోయిన్
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

