ట్రంప్ కుడిచేతి వెనుక తెల్లటి మచ్చ..అమెరికా అధ్యక్షుడి ఆరోగ్యంపై
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన కుడి చేతిపై కమిలిన గాయాలు కనిపించడం కలకలం రేపుతోంది. ట్రంప్ కుడిచేతి వెనుక భాగంలో ఓ తెల్లటి మార్క్ తాజాగా కనిపించింది. సోమవారం ఓవల్ ఆఫీస్‌లో జరిగిన సమావేశం సందర్భంగా అది కెమెరాకు చిక్కింది. ఇది ట్రంప్ ఆరోగ్యంపై ఆందోళన పెంచింది.
ఇది చూసిన ట్రంప్ మద్దతుదారులు బాధపడుతున్నారు. గతంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ వింత వ్యాధితో బాధపడుతున్నారంటూ వదంతులు వెలుగులోకి వచ్చాయి. ట్రంప్ చేయించుకున్న వైద్య పరీక్షల్లో ఓ దీర్ఘకాలిక సమస్య ఉన్నట్లు తెలిసింది. 79 ఏళ్ల ట్రంప్‌కు కాళ్లల్లో వాపు వచ్చినట్లు గమనించడంతో వెంటనే వైద్య పరీక్షలు చేయించగా ‘క్రానిక్ వీనస్ ఇన్‌సఫిషియెన్సీ’ అనే వ్యాధి ఉన్నట్లు నిర్థారణ అయింది. ఇటీవల ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్‌తో భేటీ సందర్భంగా ట్రంప్ చేతిపై కమిలిన గాయాలు కనిపించాయి. ఆ తర్వాత న్యూజెర్సీలో జరిగిన ఫిపా క్లబ్ వరల్డ్ కప్ తిలకించేందుకు వచ్చిన ట్రంప్ కాస్త అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కనిపించారు. కాళ్ల వద్ద నరాలు ఉబ్బిపోయినట్లుగా, కుడి చేతిపై పలు చోట్ల వాపు ఉన్నట్లు కెమెరా కంట పడింది. ఇప్పుడు మరోసారి ట్రంప్ కుడి అరచేతి వెనుక భాగంలో ఇలాంటి గాయాలే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఆ కమిలిన గాయాన్ని దాచేందుకు అధ్యక్షుడు మేకప్‌తో కవర్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శరీర మాంసాన్ని తినే ఈగ లార్వాలు ఈ భయానక వ్యాధితో చాలా డేంజర్
మెట్రో ట్రాక్‌పై పడిపోయిన సెక్యూరిటీ గార్డు.. క్షణాల్లోనే
17వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. నాలుగో కాన్పు అని అబద్ధం
మూడు నెలల్లో పదిమంది పుస్తెలతాళ్ళు తెంచుకుపోయాడు.. ఎందుకో తెలిస్తే
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

