Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Elections: మరోసారి గెలుపు ధీమాతో ఈటెల.. అంత సీన్ లేదంటున్న కౌశిక్ రెడ్డి

హుజురాబాద్ ఎన్నికల బాధ్యతను జమునా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రాజేందర్ ఎక్కువగా గజ్వేల్‌పై దృష్టి పెట్టుకున్నారు. అక్కడ ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాననే ఇది వరకు ప్రకటించారు. ఇటీవల హుజురాబాద్లో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో కూడా నేతలు, కార్యకర్తలు కథ నాయకుడిగా పని చేయాలంటూ పిలుపునిచ్చారు. దీంతో కేడర్‌ను సమన్వయం చేసే బాధ్యతలను జమునా తీసుకుంటున్నారు.

Telangana Elections: మరోసారి గెలుపు ధీమాతో ఈటెల.. అంత సీన్ లేదంటున్న కౌశిక్ రెడ్డి
Etela Jamuna Rajendar
Follow us
G Sampath Kumar

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 26, 2023 | 12:52 PM

మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ నేత ఈటెల రాజేందర్.. రెండు చోట్లు పోటీ చేస్తున్నారు. ఒక్కటి.. సొంత నియోజకవర్గం హుజురాబాద్ కాగా, మరొక్కటి సీఎం కేసీఆర్ ప్రాతినథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం. అయితే.. హుజురాబాద్ నుంచి వరుసగా విజయం సాధిస్తు వస్తున్నారు. మొదటిసారిగా, హుజురాబాద్‌తో పాటు మరో నియోజకవర్గంలో పోటీకి దిగుతున్నారు ఈటెల. సీఎం కేసీఆర్ పోటీ చేసే.. గజ్వేల్ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే హుజూరాబాద్‌లో ఎవరు ప్రచారం నిర్వహిస్తారనే చర్చ సాగుతుంది. అయితే ఆయన సతీమణి జమునా రెడ్డి ఈటెల ప్రచార బాధ్యతలు తీసుకోనున్నారు. ఇప్పటికే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు.

మరోసారి హుజురాబాద్ బరిలో ఈటెల రాజేందర్

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజవర్గం నుంచీ మరోసారి ఈటెల రాజేందర్ పోటీ చేస్తున్నారు. ఆయన.. ఇక్కడ ఓటమి లేకుండా, విజయం సాధిస్తూ వస్తున్నారు. మారిన రాజకీయ పరిణామాలతో బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరిపోయారు. తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో సత్తా చాటారు. అయితే, ఈటెలతో పాటు.. ఆయన సతీమణి జమునా రెడ్డి.. ఉప ఎన్నికల్లో ప్రచారం చేశారు. సుమారుగా మూడు నెలల పాటు. ప్రచారం చేసి. వివిధ సమావేశాల్లో పాల్గొన్నారు. అంతేకాకుండా.. కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడారు. ఈటెలకు ప్రాణహానీ ఉందనే విషయాన్ని కూడా జనం దృష్టికి తీసుకువచ్చారు.

అ క్రమంలోనే పూర్తిగా హుజురాబాద్ ఎన్నికల బాధ్యతను జమునా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రాజేందర్ ఎక్కువగా గజ్వేల్‌పై దృష్టి పెట్టుకున్నారు. అక్కడ ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాననే ఇది వరకు ప్రకటించారు. ఇటీవల హుజురాబాద్లో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో కూడా నేతలు, కార్యకర్తలు కథ నాయకుడిగా పని చేయాలంటూ పిలుపునిచ్చారు. దీంతో కేడర్‌ను సమన్వయం చేసే బాధ్యతలను జమునా తీసుకుంటున్నారు.

హుజురాబాద్ ప్రచార బాధ్యతలు జమునారెడ్డికి..

హుజురాబాద్ నియోకవర్గంలో అందరి నేతలతో జమునాకు పరిచయాలు ఉన్నాయి. అంతేకాకుండా…. వివిధ సమావేశాల్లో కూడా మాట్లాడిన అనుభవం ఉంది. అదే విధంగా భూముల వ్యవహారంలో కూడా జామున మాట్లాడారు. బీఆర్ఎస్ వీడిన తరువాత ఈటెలతో అన్ని సమావేశాల్లో జమునా పాల్గొంటున్నారు. ఇటీవల జమ్మికుంటకు.. రాజ్ నాథ్ సింగ్ వచ్చిన సమయంలో కూడా వేదికపై ఉన్నారు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మరో రెండు మూడు రోజుల్లో హుజురాబాద్‌లోనే ఉంటూ ప్రచారం చేయాలని ఫ్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఓటమి భయంతోనే గజ్వేల్ ప్రచారంః బీఆర్ఎస్

మరోవైపు హుజురాబాద్‌లో ఓడిపోతానన్న భయంతోనే గజ్వేల్ నియోజవకర్గం నుంచి పోటీ చేస్తున్నారని విమర్శిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. అందుకే గజ్వేల్‌లోనే ప్రచారం చేసుకుంటున్నారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే.. జమునారెడ్డి కూడా దీటుగా సమాధానం చెప్పేందుకు రెఢి అవుతున్నారు.

బీజేపీ, బీఆర్ఎస్ మధ్యనే ప్రధాన పోరు..

మరోవైపు ఈటెల రాజేందర్ హుజురాబాద్ నియోజకవర్గ ప్రచారంలో భాగంగా నాలుగైదు బహిరంగ సభలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇంటింటి ప్రచార బాధ్యతలు మాత్రం జమునా రెడ్డికి అప్పజెప్పనున్నారు. అదే విధంగా.. ఎలాంటి పార్టీలో ఎలాంటి వి బేధాలు లేకుండా.. కలిసి పని చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి, ఇక్కడ ప్రధాన పోరు.. బీజేపీ, బీఆర్ఎస్ మధ్యనే నెలకొంది. రాజేందర్ మాత్రం.. రెండు చోట్ల విజయం సాధిస్తామనే ధీమాతో ఉన్నారు. మొదటిసారిగా హుజురాబాద్‌లో పూర్తి స్థాయిలో ప్రచారంలో పాల్గొనలేకపోతున్నానని అంటున్నారు.. ఇక … పూర్తి బాధ్యతలు జమునా రెడ్డి తీసుకొని ప్రచార పర్వంలో అడుగు పెడుతుండటంతో గెలుపోటములు ఆసక్తికరంగా మారాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..