AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Election: తెలంగాణ దంగల్‌లోకి పవన్ కళ్యాణ్? సొంత పార్టీ నేతల తరపునేనా? బీజేపీకి ప్రచారం చేస్తారా?

ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీ - జనసేన దూకుడు పెంచాయి. పవన్ ప్రచారానికి రంగం సిద్దం చేశాయి ఇరు పార్టీలు. అటు బీజేపీ నుంచి నడ్డా, అమిత్‌షా వరుస సభలు, రోడ్‌ షోలతో హోరెత్తించనున్నారు. జనసేన అభ్యర్థుల ఎంపిక విషయంలో వ్యూహాత్మంగా అడుగులు వేసిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు వారి గెలుపు బాధ్యతను కూడా భుజాన వేసుకున్నరనే టాక్ వినిపిస్తుంది.

Telangana Election: తెలంగాణ దంగల్‌లోకి పవన్ కళ్యాణ్? సొంత పార్టీ నేతల తరపునేనా?  బీజేపీకి ప్రచారం చేస్తారా?
Pawan Kalyan In Telangana
Balaraju Goud
| Edited By: |

Updated on: Nov 17, 2023 | 11:38 AM

Share

తెలంగాణ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. మూడు ప్రధాన పార్టీల మధ్య నువ్వా- నేనా అన్నట్లు ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌లో జనసేనపార్టీ, ఆపార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ హాట్‌ టాఫిక్‌గా మారారు. తెలంగాణలో పార్టీని అనౌన్స్ చేసిన నాటినుంచి ప్రత్యక్ష ఎన్నికలు పోటీ చేయని జనసేన.. ఈసారి భారతీయ జనతా పార్టీతో పొత్తులో భాగంగా 8చోట్ల పోటీ పడుతుంది. అటు జనసేన అభ్యర్థులు సైతం బీజేపీతో కలిసి సమన్వయంతో జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు.

అయితే క్యాండిడేట్స్ ను అనౌన్స్ చేశాక.. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న బీసీ ఆత్మగౌరవ సభలో తప్పా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ ఎక్కడ కనపించలేదు. వారి అభ్యర్థుల తరపున పవన్‌ ప్రచారం ఇప్పటి వరకు ఎక్కడ ప్రారంభించలేదు. సమయం దగ్గరపడున్నా పవన్‌ ప్రచారం ఏక్కడ కనిపంచకపోవడంతో.. అసలు ప్రచారంలో పాల్గొంటారా? అనే అనుమానాలు రేకెత్తాయి. అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే వాటంన్నిటికి చెక్‌ పెడుతూ పవన్‌ ప్రచారానికి సంబంధించిన డేట్స్‌ ను లీక్ చేశాయి పార్టీ వర్గాలు.

జనసేన అభ్యర్థుల ఎంపిక విషయంలో వ్యూహాత్మంగా అడుగులు వేసిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు వారి గెలుపు బాధ్యతను కూడా భుజాన వేసుకున్నరనే టాక్ వినిపిస్తుంది. జనసేన పార్టీ తరపున పోటీ చేస్తున్న 8మంది అభ్యర్థుల తరపున నవంబర్ 22న నుంచి సుడిగాలి ప్రచారం చేస్తారని కొంతమంది.. లేదు.. లేదు.. 9,20 తేదీల్లో రెండు రోజుల పాటు పవన్ ప్రచారానికి యాక్షన్ సిద్ధమైందనే టాక్ వినిపిస్తుంది. టోటల్‌గా పవన్ ప్రచారానికి సంబంధించిన డీటెల్స్.. రూట్‌ మ్యాప్‌ ఇవాళ తెలిసే ఛాన్స్ ఉంది. అయితే పవన్‌ కేవలం జనసేన అభ్యర్ధులకే కాదు.. బీజేపీ క్యాండెట్స్ తరపున కూడా ప్రచారంలో పాల్గొనే అవకాశముందని తెలుస్తోంది.

మరోవైపు బీజేపీ అగ్రనేతలు అమిత్‌ షా, నడ్డా పర్యటనలు ఖరారు అయ్యాయి. నవంబర్ 18న సకల జనుల సంకల్ప సభల్లో అమిత్‌షా పాల్గొంటారు. గద్వాల, నల్గొండ, వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని నిర్వహించే సభల్లో పాల్గొంటారు అమిత్ షా. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సైతం నవంబర్ 19న తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. చేవెళ్ల, నారాయణపేట్‌ సభల్లో పాల్గొననున్న నడ్డా.. మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో రోడ్‌షో నిర్వహిస్తారు నడ్డా.

ఇక, తెలంగాణలోని 119 నియోజకవర్గాలకు గానూ నవంబర్ 30వ తేదీన పోలింగ్ జరుగనుంది. డిసెంబర్ 3న 5 రాష్ట్రాల ఎన్నికలతో పాటు ఫలితాలు వెల్లడి కానున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం