Telangana Election: మళ్లీ పాత కాపుల మధ్యనే పోరు.. ప్రచారంలో స్పీడ్ పెంచిన ప్రధాన పార్టీ అభ్యర్థులు
ఇక్కడ మళ్ళీ పాత కాపులు మధ్యనే ప్రధాన పోరు కనిపిస్తుంది. దీంతో పొలిటికల్ పార్టీలు ప్రచారంలో స్పీడ్‌ను పెంచాయి. ఇప్పటికే, నియోజకవర్గం మొత్తం చుట్టేస్తున్నారు అభ్యర్థులు. హామీల వర్షం కురిపిస్తూ.. ప్రజల్లోకి వెళ్తున్నారు.. ఈసారి ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో గతంతో పోలీస్తే, పొలిటికల్ వేడి పెరిగిపోయింది.

కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొంది. ఇక్కడ మళ్ళీ పాత కాపులు మధ్యనే ప్రధాన పోరు కనిపిస్తుంది. దీంతో పొలిటికల్ పార్టీలు ప్రచారంలో స్పీడ్‌ను పెంచాయి. ఇప్పటికే, నియోజకవర్గం మొత్తం చుట్టేస్తున్నారు అభ్యర్థులు. హామీల వర్షం కురిపిస్తూ.. ప్రజల్లోకి వెళ్తున్నారు.. ఈసారి ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో గతంతో పోలీస్తే, పొలిటికల్ వేడి పెరిగిపోయింది. అన్ని పార్టీల సభలు, సమావేశాలకు ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారు. మొన్నటి వరకు బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోరు ఉండేదీ. తాజాగా ఇబీజేపీ పుంజుకుని త్రిముఖ పోరుగా మారింది.
చొప్పదండి నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు.. ఈ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ మరోసారి బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన మేడిపల్లి సత్యం కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగుతున్నారు. అదే విధంగా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ భారతీయ జనతా పార్టీ తరుపున పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఈ ముగ్గురు పోటీ చేశారు. మరోసారి ఈ ముగ్గురే తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎన్నికల సమరంలోకి దిగారు. 2018 ఎన్నికల కంటే ముందు.. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే బొడిగె శోభకు టికెట్ రాకపోవడంతో బీజేపీలో చేరారు. ప్రస్తుతం కాషాయ దళంగా ఉండగా ఉండటంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక తాజా మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. గత రెండు నెలల నుంచి జనంలో ఉండి ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. రెండోవ సారి ఖచ్చితంగా విజయం సాధిస్తామనే ధీమాతో ప్రజల్లోకి వెళ్తున్నారు. మారుతున్న రాజకీయ పరిణామాలతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు కాంగ్రెస్ లో చేరడంతో కారు పార్టీలో కలవరం మొదలైంది. కొంత మంది నేతలు వెళ్లిన.. తమ పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదని రవి శంకర్ అంటున్నారు.
ఇక కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యం సానుభూతిని నమ్ముకున్నారు. గత ఎన్నికల్లో.. రవి శంకర్ చేతిలో ఓడిపోయారు. ప్రభుత్వ వైఫల్యాలు వరిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు.. అయితే, వివిధ పార్టీలకు చెందిన నేతలు కాంగ్రెస్ లో చేరడంతో.. అదనపు బలంగా మారింది. ప్రజల మద్దతు చూస్తే, ఖచ్చితంగా విజయం సాధిస్తామనే ధీమాతో ఉన్నారు కాంగ్రెస్ నేతలు. మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ బీజేపీ తరఫున బరిలో నిలిచారు. గత కొద్ది రోజులుగా ప్రచారంలో దూకుడు పెంచారు. మహిళ ఓట్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదే విధంగా బిసి ముఖ్యమంత్రితో పాటు, ఎస్సీ వర్గీకరణ అంశంతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ నియోజకవర్గంలో 35 వేలపైగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. ఈ ఓట్లపై దృష్టి పెట్టారు బొడిగె శోభ. అదే విధంగా బిసి కులాల ఓట్ల తమకే దక్కుతాయనే భావనలో ఉన్నారు.
ఈ ముగ్గురు నేతలకు.. నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది. దీంతో గ్రామ, గ్రామన పర్యటిస్తున్నారు. ప్రతి ఓటరును కలుస్తున్నారు. అంతేకాకుండా.. కుల సమీకరణలపై దృష్టి పెట్టారు. ఇక్కడ ఎస్సీ వర్గం తరువాత.. మున్నరుకాపు, గీత కార్మికులు, ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు గెలుపు, ఓటములపై ప్రభావం చూపుతాయి. ఈ నియోజకవర్గం పూర్తిగా గ్రామీణ నియోజకవర్గం. దీంతో.. రైతుల ఓట్లపై అభ్యర్థులు దృష్టి పెట్టారు. అంతేకాకుండా, ముఖ్య నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక్కడ మాత్రం రోజు రోజుకు రాజకీయ వాతరవణం వేడెక్కుతుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
