Telangana CM KCR: నిరుద్యోగులకు ముఖ్యమంత్రి వరాలు.. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన ఇదే..
అనుకున్నట్లు గానే అసెంబ్లీలో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు కీలక ప్రకటన చేశారు. తెలంగాణ ఉద్యమం, అనంతరం స్వరాష్ట్ర సాధన విషయాలను సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా మరోమారు ప్రస్తావించారు. తెలంగాణ ఏర్పాటు చరిత్రలో ఒక ప్రత్యేక ఘట్టం అన్నారు.
CM KCR Announcement on Jobs: అనుకున్నట్లు గానే అసెంబ్లీలో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు కీలక ప్రకటన చేశారు. తెలంగాణ(Telangana) ఉద్యమం, అనంతరం స్వరాష్ట్ర సాధన విషయాలను సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా మరోమారు ప్రస్తావించారు. తెలంగాణ ఏర్పాటు చరిత్రలో ఒక ప్రత్యేక ఘట్టం అన్న కేసీఆర్.. తెలంగాణ తొలిదశలో ఉద్యమంలో నేనూ కూడా లాఠీదెబ్బలు తిన్నా.. వివక్ష, అన్యాయంతో తెలంగాణ నలిగిపోయిందన్నారు.తెలంగాణలో వేరే పార్టీలకు రాజకీయాలంటే ఓ గేమ్.. కానీ టీఆర్ఎస్(TRS) పార్టీకి రాజకీయాలంటే ఓ టాస్క్. ఈ రోజు తెలుగు సినిమాల్లో తెలంగాణ భాష పెడితేనే సినిమా హీరో క్లిక్ అవుతున్నాడు.. ఒకప్పుడు తెలంగాణ భాషను జోకర్‌లా పెట్టేవారన్నారు సీఎం కేసీఆర్.
తెలంగాణ కోసం విద్యార్థులు ఉద్యమం చేశారని గుర్తు చేశారు. వివక్ష, అన్యాయంతో తెలంగాణ సమాజం నలిగిపోయిందన్న కేసీఆర్.. ఆకలిచావులు, ఆత్మహత్యలు, లక్షల సంఖ్యలో వలసలు గతంలో నిత్యకృత్యమన్నారు. ఉద్యోగాలు రాలేదన్న బాధతో ఉన్న నిరుద్యోగులను.. తెలంగాణ సమాజంలో చూశామన్న కేసీఆర్… తెలంగాణ ప్రజలకు ఉమ్మడి రాష్ట్రంలో న్యాయం జరగదని, అందుకే పిడికెడు మందితో పోరాటం ప్రారంభించానన్నారు.14 ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో రాష్ట్రం సాకారమైందన్నారు.
- ఉమ్మడి రాష్ట్రంలో మాకు న్యాయం జరగదనే..తెలంగాణ కోసం పోరాడామన్నారు సీఎం కేసీఆర్. పిడికెడు మందితో ప్రారంభమై..14 ఏళ్ల సుదీర్థ పోరాటం తర్వాత రాష్ట్రం సాకారమైందన్నారు.
- వేరే పార్టీలకు రాజకీయాలంటే ఓ గేమ్.. కానీ టీఆర్‌ఎస్‌కు మాత్రం టాస్క్ అన్నారు సీఎం కేసీఆర్. ఎంతో పోరాటం చేసి రాష్ట్రాన్ని తెచ్చామని..రాష్ట్రం కోసం ఎవరేం చేశారో ప్రజలకు తెలుసన్నారు. ఇవాళ తమను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని..ఐనా చిల్లరగాళ్లని వదిలిపెట్టామన్నారు.
- తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేవలం.. నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిందన్నారు. తెలంగాణ లో గతంలో లాగా.. ఇప్పుడు కరెంట్ కోతలు లేవన్నారు. ప్రతి రూపాయి.. తెలంగాణ అభివృద్ధికే పెడుతున్నామని చెప్పారు సీఎం కేసీఆర్. నిధులు, నీళ్లు అన్ని సెట్ చేసుకున్నామని.. కానీ నియామకాల విషయం లో ఏపీ దారుణం గా వ్యవహరిస్తుందని మండిపడ్డారు.
- తెలంగాణ రాష్ట్రం కోసం నేనూ లాఠీ దెబ్బలు తిన్నానని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ తొలిదశలో ఉద్యమంలో నేనూ కూడా లాఠీదెబ్బలు తిన్నా.. వివక్ష, అన్యాయంతో తెలంగాణ నలిగిపోయిందని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ అన్నారు.
- తెలంగాణలో శాఖల వారీగా ఉన్న ఖాళీలపై సర్వే నిర్వహించామని ముఖ్యమంత్రి తెలిపారు. మొత్తం 28శాఖల్లో 1లక్ష 56వేల ఉద్యోగాలు నోటిఫై చేశామన్నారు. ఇందులో ఇప్పటికే 1లక్ష33 వేలఉద్యోగాలు భర్తీ చేశాం. మరో 22వేల ఉద్యోగాలు నియామాక ప్రక్రియలో ఉన్నాయి. 95 శాతం లోకల్ కోటా.. కేవలం 5 శాతమే ఓపెన్ కోటాలోనే ఉద్యోగాలను భర్తీ చేశాం. విద్యుత్ శాఖలో 22వేల మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశామన్నారు సీఎం కేసీఆర్.
- తెలంగాణా ప్రభుత్వం కృషి వల్ల, ఇకనుంచీ ప్రభుత్వ ఉద్యోగాలలో అత్యంత దిగువ స్థాయి క్యాడర్ నుంచి ఉన్నత స్థాయి క్యాడర్ దాకా అంటే అటెండర్ నుంచి ఆర్డీవో దాకా స్థానిక అభ్యర్థులకు 95 శాతం రిజర్వేషన్ అమలవుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. దేశంలో స్థానికులకు ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో 95 శాతం రిజర్వేషన్ సాధించిన ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.
- 91,142 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. నేటి నుండే అప్లికేషన్ చేసుకోవచ్చని తెలిపారు.
- 11,103 కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కేసీఆర్..
- 80,039 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు. విద్యాశాఖలో 25 నుంచి 30 వేల వరకు పోస్టులు ఉన్నాయని సీఎం చెప్పారు.
- భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 371- డి ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణలు చేయడం కోసం ప్రతిపాదనలు పంపించామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తెలిపారు. కేంద్రం అనవసర తాత్సారం చేసినా.. స్వయంగా అనేకసార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి, రాష్ట్రపతిని కలిసి దీనికున్న ప్రాముఖ్యతను వివరించినట్లు చెప్పారు. ఇందు కోసం ఏర్పాటు చేసిన అధికారుల బృందం ఢిల్లీలో కేంద్రంతో ఎప్పటికప్పడు సంప్రదింపులు జరుపుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాల ఫలితంగా రాష్ట్రపతి ఉత్తర్వల సవరణ సాధ్యమైందన్నారు. ఇది తెలంగాణా ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన చారిత్రాత్మకమైన విజయం అన్నారు.
- విద్యుత్ ఉద్యోగులు, 9, 10వ షెడ్యూల్ సంస్థల పంచాయతీ ఇంకా తెగలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్ధరహిత పంచాయతీలను ఎన్నో పెడుతున్నారు. టీఎస్ ఆర్టీసీ ఆస్పత్రిలోనూ వాటా కావాలని కోరుతున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల విభజనను కూడా సక్రమంగా చేయలేదు.
- జిల్లాల వారీగా ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు చూస్తే..హైదరాబాద్ – 5,268 నిజామాబాద్ – 1,976 మేడ్చల్-మల్కాజ్‌గిరి – 1,769 రంగారెడ్డి – 1,561 కరీంనగర్ – 1,465 నల్గొండ – 1,398 కామారెడ్డి – 1,340 ఖమ్మం – 1,340 భద్రాద్రి కొత్తగూడెం – 1,316 నాగర్ కర్నూల్ – 1,257 సంగారెడ్డి – 1,243 మహబూబ్‌నగర్ – 1,213 ఆదిలాబాద్ – 1,193 సిద్ధిపేట్ – 1,178 మహబూబాబాద్ – 1,172 హన్మకొండ – 1,157 మెదక్ – 1,149 జగిత్యాల – 1,063 జగిత్యాల – 1,063.. మంచిర్యాల – 1,025 యాదాద్రి-భువనగిరి – 1,010 జయశంకర్ భూపాలపల్లి – 918 నిర్మల్-876..వరంగల్ – 842 కొమురంభీం ఆసిఫాబాద్ – 825 పెద్దపల్లి-800.. జనగాం-760.. నారాయణ్‌పేట్-741 వికారాబాద్-738.. సూర్యాపేట్-719.. ములుగు-696 జోగులాంబ గద్వాల్-662.. రాజన్న సిరిసిల్లా-601.. వనపర్తి-556
- శాఖల వారీగా ఉద్యోగాలు..
రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో 80,039 ఖాళీలు ఉన్నాయని, వాటిని నేరుగా భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. నియామక ప్రక్రియ నేటినుంచే ప్రారంభమవుతుందని చెప్పారు.
- శాఖల వారీగా ఖాళీల వివరాలు.. హోం శాఖ- 18,334 సెకండరీ ఎడ్యుకేషన్- 13,086 హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్- 12,755 హయ్యర్ ఎడ్యుకేషన్- 7,878 బీసీల సంక్షేమం- 4,311 రెవెన్యూ శాఖ- 3,560 ఎస్సీ వెల్ఫేర్ శాఖ- 2,879 నీటిపారుదల శాఖ- 2,692 ఎస్టీ వెల్ఫేర్- 2,399 మైనారిటీస్ వెల్ఫేర్- 1,825 ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ మరియు టెక్నాలజీ- 1,598 పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ- 1,455 లేబర్, ఎంప్లాయీమెంట్- 1,221 ఆర్థిక శాఖ- 1,146 మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్- 895 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్- 859 అగ్రికల్చర్, కో-ఆపరేషన్- 801 రవాణా, రోడ్లు, భవనాల శాఖ- 563 న్యాయశాఖ- 386 పశుపోషణ, మత్స్య విభాగం- 353 జనరల్ అడ్మినిస్ట్రేషన్- 343 ఇండస్ట్రీస్, కామర్స్- 233 యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం, కల్చర్- 184 ప్లానింగ్- 136 ఫుడ్, సివిల్ సప్లయిస్- 106 లెజిస్లేచర్- 25 ఎనర్జీ- 16