Telangana CM KCR: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. 91,142 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. సీఎం కేసీఆర్ కీలక ప్రకటన

ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు సీఎం కేసీఆర్‌. మొత్తం 91,142 పోస్టులను నోటిఫై చేశామన్నారు. 80,039 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇస్తున్నట్టు ప్రకటించారు. 11,103 కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయనున్నట్టు ప్రకటించారు.

Telangana CM KCR: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. 91,142 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. సీఎం కేసీఆర్ కీలక ప్రకటన
Cm Kcr Big Announcement In Telangana Assembly Budget Session 2022
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 09, 2022 | 11:12 AM

CM KCR Jobs Announcement: అన్నట్లుగానే టంచనుగా పదికాగానే ప్రకటన చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. నిరుద్యోగ యువతా గెట్ రెడీ అంటూ.. 91,142 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. అన్ని ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో న్యాయం జరగదనే..తెలంగాణ కోసం పోరాడామన్నారు పిడికెడు మందితో ప్రారంభమై..14 ఏళ్ల సుదీర్థ పోరాటం తర్వాత రాష్ట్రం సాకారమైందన్నారు. వేరే పార్టీలకు రాజకీయాలంటే ఓ గేమ్‌..కానీ టీఆర్‌ఎస్‌కు మాత్రం టాస్క్ అన్నారు సీఎం కేసీఆర్. ఎంతో పోరాటం చేసి రాష్ట్రాన్ని తెచ్చామని..రాష్ట్రం కోసం ఎవరేం చేశారో ప్రజలకు తెలుసన్నారు. ఇవాళ తమను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని.. అయినా చిల్లరగాళ్లని వదిలిపెట్టామన్నారు.

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు రెండో రోజు ప్రారంభ‌మ‌య్యాయి. బుధవారం ఉద‌యం 10 గంట‌ల‌కు స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి శాస‌న‌స‌భ‌ను ప్రారంభించారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని ర‌ద్దు చేసి నేరుగా బ‌డ్జెట్‌పై చ‌ర్చ చేప‌ట్టారు. రాజకీయాలంటే తమకు పవిత్రమైన కర్తవ్యమని సీఎం కేసీఆర్‌ అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. 14 ఏళ్ల సుదీర్ఘ ఘర్షణ తర్వాత తెలంగాణ సాకారమైందని తెలిపారు. తెలంగాణ ఏర్పాటు దేశ చరిత్రలో మహోన్నత ఘట్టమన్నారు. దశాబ్దాల తరబడి తెలంగాణ అంతులేని దగా పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రజలు క్షోభ, బాధ అనుభవించారని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణలో ఆకలి చావులు, ఆత్మహత్యలు చూశామన్నారు. నిరాశలో యువత తుపాకులు పట్టి ఉద్యమం నడిపించారని సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమేహుడా భూములు అమ్మి వేరే ప్రాంతంలో ఖర్చు పెట్టినా నాటి తెలంగాణ పెద్దలు నోరు మెదపలేదని విమర్శించారు.

రాష్ట్ర విభజన సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఆరోపించారు. విద్యుత్‌ ఉద్యోగుల సమస్య సుప్రీంకోర్టు దాకా వెళ్లిందన్నారు. నియామకాలపై అర్ధరహిత వివాదాలు సృష్టించారని విమర్శించారు. తెలంగాణ ఆస్తుల విషయంలో వివాదాలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎస్‌ సహా 14 మంది ఐఏఎస్‌ల విషయంలో వివాదాలు చేస్తున్నారన్నారు. స్వరాష్ట్ర పాలనలో అద్భుతంగా పంటలు పండుతున్నాయని సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణకు నీళ్ల వాటా కోసం ఇప్పటికీ పోరాడుతున్నామన్నారు. రాష్ట్రంలో నీళ్లు, విద్యుత్‌ సమస్యలు పరిష్కరించుకున్నాం. రాష్ట్రంలో పంటలను కొనలేమని కేంద్రమే చేతులెత్తేసిందని చెప్పారు.

తెలంగాణలో ప్రస్తుతం మొత్తం 91,142 ఖాళీలు ఉన్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. అందులో కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పోగా.. మిగిలిన 80,039 పోస్టులకు ఇవాళ్టి నుంచే నోటిఫికేషన్లు విడుదల చేస్తామని సంచలన ప్రకటన చేశారు. 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. పోలీస్ శాఖ మినహా ఉద్యోగార్థుల వయోపరిమితిని మరో 10 పదేళ్లకు పెంచుతున్నట్లు వెల్లడించారు. 95 శాతం ఉద్యోగాలు స్థానికులే దక్కేలా రాష్ట్రపతి ఉత్తర్వులు తెచ్చామని.. దీనివల్ల అందరికీ అవకాశాలు వస్తాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. షెడ్యూల్ 9, 10 సంస్థల వివాదం పరిష్కారమైతే.. అక్కడ కూడా అవకాశాలు వస్తాయని తెలిపారు. మరో 10 నుంచి 20వేల ఉద్యోగాల ఉద్యోగాలు వచ్చే అవకాశముందని తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ తెలిపారు.

విద్యుత్ ఉద్యోగులు, 9, 10వ షెడ్యూల్ సంస్థల పంచాయతీ ఇంకా తెగలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్ధరహిత పంచాయతీలను ఎన్నో పెడుతున్నారు. టీఎస్ ఆర్టీసీ ఆస్పత్రిలోనూ వాటా కావాలని కోరుతున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల విభజనను కూడా సక్రమంగా చేయలేదని సీఎం కేసీఆర్ విమర్శించారు. కాగా, ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 55 వేల పోస్టులను నోటిఫి చేశాం. లక్షా 30 వేలు భర్తీ అయ్యాయి. 22వేల ఉద్యోగాలకు ప్రాసెస్ జరుగుతుంది. ఏపీ వారితో పంచాయతీ రాకూడదనే ఉద్దేశంతోనే రాష్ట్రపతి ఉత్తర్వుల కోసం పంపించాం. కానీ చాలాకాలం పెండింగ్‌లో పెట్టారు. వెంటపడిమరీ చేయించుకున్నామని స్పష్టం చేశారు.ఎవరి ఉద్యోగాలు వారికే వచ్చేలా 95శాతం కోటాతో రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకొచ్చాం. అది మా చిత్తశుద్ధి. అటెండర్ పోస్ట్ నుంచి ఆర్డీవో పోస్టులు 95 శాతం స్థానికులకే వస్తాయి. 5శాతం మాత్రమే ఓపెన్ కోటాలోకి వెళ్తాయి. అందులోనూ కొన్ని పోస్టులు జనరల్ కింద స్థానికులకే దక్కుతాయని సీఎం కేసీఆర్ వెల్లడించారు.