Telangana: మహిళ జడ్జ్‌కు న్యాయవాది వేధింపులు.. సుమోటోగా స్వీకరించిన హైకోర్టు

మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా.. కొందరి వ్యవహర శైలిలో ఎలాంటి మార్పు రావడం లేదు. తెలంగాణలో వింత పరిస్థితి చోటు చేసుకుంది. ఏకంగా మహిళ జడ్జ్ నే వేదింపులకు గురి చేశాడు ఓ ప్రబుద్ధుడు. ఈ ఘటన పలువురు న్యాయవాదులను నివ్వెర పోయేలా చేసింది. స్థానికంగా ఉన్న రంగారెడ్డి కోర్టులో మెజిస్ట్రేట్‌గా మహిళ న్యాయమూర్తి ఉన్నారు. రంగారెడ్డి కోర్టులో అడ్వకేట్ గా పని చేస్తున్న శ్రీనివాస్ అనే వ్యక్తి మహిళ న్యాయమూర్తిని..

Telangana: మహిళ జడ్జ్‌కు న్యాయవాది వేధింపులు.. సుమోటోగా స్వీకరించిన హైకోర్టు
TS High Court
Follow us
Lakshmi Praneetha Perugu

| Edited By: Srilakshmi C

Updated on: Dec 19, 2023 | 1:25 PM

హైదరాబాద్‌, డిసెంబర్‌ 19: మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా.. కొందరి వ్యవహర శైలిలో ఎలాంటి మార్పు రావడం లేదు. తెలంగాణలో వింత పరిస్థితి చోటు చేసుకుంది. ఏకంగా మహిళ జడ్జ్ నే వేదింపులకు గురి చేశాడు ఓ ప్రబుద్ధుడు. ఈ ఘటన పలువురు న్యాయవాదులను నివ్వెర పోయేలా చేసింది. స్థానికంగా ఉన్న రంగారెడ్డి కోర్టులో మెజిస్ట్రేట్‌గా మహిళ న్యాయమూర్తి ఉన్నారు. రంగారెడ్డి కోర్టులో అడ్వకేట్ గా పని చేస్తున్న శ్రీనివాస్ అనే వ్యక్తి మహిళ న్యాయమూర్తిని వేధింపులకు గురి చేశాడు. ఈ వ్యవహారంపై మహిళా న్యాయమూర్తి స్థానిక పోలీసులకు సైతం ఫిర్యాదు చేసింది.

మొదట ఒక కాలేజ్ ఫంక్షన్ కి ఉమెన్స్ డే కార్యక్రమానికి వెళ్ళిన మహిళా న్యాయమూర్తికి విషెస్ చెప్పడానికి న్యాయవాది ప్రయత్నించాడు. ఆ తర్వాత న్యాయమూర్తి చాంబర్‌లో ఒక స్పెషల్ పెన్నును పెట్టాడు. ఆ పెన్నుపై తన పేరుతో పాటు మహిళ న్యాయమూర్తి పేరును జోడిస్తూ ఉంది. ఇది గమనించిన మహిళా న్యాయమూర్తి న్యాయవాది ప్రవర్తన చూసి నివ్వెర పోయింది. ఆ తరువాత మహిళ న్యాయమూర్తి ఇంటి పరిసరాల్లోనూ న్యాయవాది కనిపించాడు. మరోసారి న్యాయవాదిని పిలిచి మహిళా మేజిస్ట్రేట్ వార్నింగ్ ఇచ్చింది. అయినా సరే అతడి వ్యవహార శైలిలో ఎలాంటి మార్పు రాలేదు.

ఈ విషయంపై తెలంగాణ బార్ కౌన్సిల్ సైతం అభ్యంతరం వ్యక్తం చేసింది. పలుమార్లు న్యాయవాది శ్రీనివాసులు హెచ్చరించినప్పటికీ అతడు మారకపోవడంతో బార్ కౌన్సిల్ నుంచి అతన్ని సస్పెండ్ చేసింది. ఈ ఉదాంతం పై హైకోర్టులో సైతం విచారణ జరిగింది. ఈ ఘటనపై సుమోటోగా హైకోర్టు కేసును విచారణకు స్వీకరించింది. సదరు న్యాయవాదిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు నోటీసులు జారీ చేసింది. అతనిపై తీసుకున్న చర్యలకు సంబంధించి నాలుగు వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?