ఇలా అయితే బతికేది ఎలా.. వంద శాతానికి పైగా పెరిగిన ధరలు, సామాన్యుల ఇక్కట్లు..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో.. అల్లం, వెల్లుల్లిని ముట్టుకుంటే షాక్ వస్తుంది.. ఎన్నడూ లేని విధంగా ధరలు పెరిగిపోయాయి. వెల్లుల్లి కిలోకు... 360 నుంచీ 380 రూపాయాల వరకు అమ్మతున్నారు. గత సంవత్సరం కిలో వెల్లుల్లి రూ. 120గా ఉండగా ఇప్పుడు ఏకంగా వంద శాతం పెరిగిపోయింది. ఇక అల్లం విషయానికొస్తే కిలో అల్లం రూ. 140 నుంచి రూ. 150 వరకు అమ్ముతున్నారు. గతేడాది కిలో అల్లం...

అల్లం, వెల్లుల్లి ధరలు అమాంతం పెరిగిపోయాయి. భారీ వర్షాల కారణంగా పంటల సాగుపై ప్రభావం చూపింది. దీంతో ఎన్నడూ లేని విధంగా.. ఒకేసారి ఏకంగా వంద శాతానికిపై ధరలు పెరిగిపోయాయి. ఎప్పుడు సామాన్యుడికి అందుబాటులో ఉండే ఈ రెండు నిత్యవసర వస్తువుల ధరలు పెరిగిపోవడంతో… సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. పెరిగిన ధరల కారణంగా తక్కువగా కొనుగోలు చేస్తూ నెట్టుకొస్తున్నారు. ధరలు పెరిగిపోవడంతో వ్యాపారం కూడా తగ్గిందని వ్యాపారులు వాపోతున్నారు. అల్లం, వెల్లుల్లి ధరలు ఎందుకు పెరిగిపోతున్నాయో.. ఇప్పుడు తెలుసుకుందాం…
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో.. అల్లం, వెల్లుల్లిని ముట్టుకుంటే షాక్ వస్తుంది.. ఎన్నడూ లేని విధంగా ధరలు పెరిగిపోయాయి. వెల్లుల్లి కిలోకు… 360 నుంచీ 380 రూపాయాల వరకు అమ్మతున్నారు. గత సంవత్సరం కిలో వెల్లుల్లి రూ. 120గా ఉండగా ఇప్పుడు ఏకంగా వంద శాతం పెరిగిపోయింది. ఇక అల్లం విషయానికొస్తే కిలో అల్లం రూ. 140 నుంచి రూ. 150 వరకు అమ్ముతున్నారు. గతేడాది కిలో అల్లం రూ . 70గా ఉండేది. ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. కరోనా తర్వాత ప్రతి ఇంట్లో అల్లం, వెల్లుల్లిని ఎక్కువగా వాడుతున్నారు. చాయ్ లో కూడా అధికంగా అల్లం వాడుతున్నారు. ధరలు పెరిగిపోవడంతో సామాన్యుడు ఇబ్బందిపడుతున్నారు.
ముఖ్యంగా అల్లం మనకు ఎక్కువగా కేరళ రాష్ట్రం నుంచీ దిగుమతి అవుతుంది. అక్కడ భారీ వర్షాల కారణంగా అల్లం పంట దెబ్బతిన్నది. దీంతో సాగుపై ప్రభావం చూపింది. ధరలు ఒకేసారి పెరిగిపోయాయి. ఇక వెల్లుల్లి మహారాష్ట్రతో పాటు ఇతర ఉత్తరాది రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటాం. అక్కడ కూడా భారీ వర్షాల కారణంగా పంట దెబ్బ తిన్నది. దీంతో వెల్లుల్లి ధరలు కూడా పెరిగిపోతున్నాయి. కొత్త పంటల చేతికొచ్చిన కూడా ధరలు మాత్రం దిగిరావడం లేదు.
పెరిగిన ధరల కారణంగా సామాన్యుడు బడ్జెట్ కూడా పెరిగిపోయింది. ధరలు పెరగడంతో అల్లం, వెల్లుల్లి వియోగాన్ని తగ్గించారు. అవసరం ఉన్న వరకు మాత్రమే వాడుతున్నారు. ఈ విధంగా ధరలు పెరగడం ఇదే మొదటిసారని వ్యాపారులు చెబుతున్నారు. ధరలు పెరిగిపోవడంతో.. వ్యాపారంపై కూడా ప్రభావం చూపిందని అంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..