Telangana Crime: దంపతుల మధ్య గొడవ.. 45 రోజుల పసికందును కాలితో తన్నిన తండ్రి
ఒక నిమిషం క్షణిక ఆవేశం ఒక పసిబిడ్డ మృతికి కారణమైంది. భార్యాభర్తల గొడవ పసికందు ప్రాణాన్ని చిదిమేసింది. అభం శుభం తెలియని ఆ చిన్నారి అనంత లోకాలకు వెళ్ళింది. మద్యం మత్తులో కన్న తండ్రే ఈ పసివాడి పాలిట కాలయముడయ్యాడు. తన రక్త సంబంధాన్ని మరిచి ప్రవర్తించాడు. ఈ దారుణ సంఘటన మెదక్ జిల్లా..

మెదక్, సెప్టెంబర్ 3: ఒక నిమిషం క్షణిక ఆవేశం ఒక పసిబిడ్డ మృతికి కారణమైంది. భార్యాభర్తల గొడవ పసికందు ప్రాణాన్ని చిదిమేసింది. అభం శుభం తెలియని ఆ చిన్నారి అనంత లోకాలకు వెళ్ళింది. మద్యం మత్తులో కన్న తండ్రే ఈ పసివాడి పాలిట కాలయముడయ్యాడు. తన రక్త సంబంధాన్ని మరిచి ప్రవర్తించాడు. ఈ దారుణ సంఘటన మెదక్ జిల్లాలో ఆదివారం జరిగింది.
మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట కేంద్రంలోని నిర్మల అనే మహిళకు ఇద్దరు కుమారులు. రెండవ కుమారుడు జస్వంత్ (45 రోజులు) అనే పసికందును మద్యానికి బానిసైన అతని తండ్రి జనముల రమేష్ హత్య చేసినట్టు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. గత రాత్రి భార్యతో గొడవ పడి గల్లీలో ఉన్నటువంటి బెల్టు షాపులో మద్యం తీసుకొని సేవించి, ఇంట్లో వచ్చి గొడవ పడుతూ ఉన్నాడని ఉదయం లేచి చూసేసరికి 45 రోజుల పసికందు విగతజీవిగా పడి ఉండడాన్ని చూసి తల్లి బోరున విలపించింది. స్థానికులు విషయాన్ని తెలుసుకొని గల్లీలలో ఇష్టమొచ్చినట్టుగా బెల్టు షాపుల ద్వారా మద్యాన్ని విక్రయిస్తూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పెద్ద శంకరంపేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని జనముల రమేష్ ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగ రమేష్ తన కొడుకును చంపినట్లు నిర్ధారణ అయింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు పేట ఎస్సై బాలరాజు తెలిపారు.
పెద్ద శంకరంపేట గ్రామంలో నెలన్నార వయసున్న జస్వంత్ మరణం ఆ తల్లికి తీరని శ్లోకాన్ని మిగిల్చింది. పెద్ద శంకరంపేట గ్రామానికి చెందిన నిర్మల ప్రసవం కోసం తన తల్లి గారి ఇంటికి వచ్చి ఇక్కడే ఉంటుంది. ఇదే సమయంలో తన బాబును చూడడానికి నిర్మల భర్త వచ్చాడు. నిర్మలని తన ఇంటికి తీసుకువెళ్లే క్రమంలో అత్తగారి ఇంట్లో గొడవ మొదలైంది.. మద్యం తాగి వచ్చిన రమేష్ కాసేపటికి నిర్మల తో గొడవ పడుతూ ఉయ్యాలలో ఉన్న పసికందును కాలితో తన్నడంతో ఉయ్యాలలో ఉన్న జస్వంత్ కిందపడి స్పృహ కోల్పోయాడు. ఎంత చెప్పిన వినిపించుకోకుండా ఆ పసికందును పట్టుకొని లక్కెందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఇద్దరి మధ్యలో ఆ బాలుడు నలిగి మృతి చెందాడు. ఇరుగుపొరుగు మద్యం మత్తులో ఉన్న రమేష్‌ని బంధించారు. అనంతరం ప్రాణం లేకుండా అచేతనంగా పడి ఉన్న జశ్వంత్ ని చూడగా ఒక్కసారిగా అందరి గుండెలు చెరువయ్యాయి. కళ్ళముందే కన్న కొడుకు ప్రాణాలు పోవడంతో ఆ తల్లి రోదనలు మిన్నంటాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




