AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Rains: ‘కమ్ముకొచ్చిన కారుమబ్బులు.. ముసురుకొన్న చిమ్మ చీకట్లు’ పట్టపగలే రోడ్లపై లైట్లతో ప్రయాణం

నిన్న మొన్నటి వరకు బానుడి భగభగలతో అసలు ఈ కాలం వానకాలమా.. లేక వేసవి కాలమా అనేలా కనిపించిన వాతవరణం ఒక్జసారిగా మారిపోయింది. ఉక్కపోతకు విరామం ఇస్తూ ఒక్కసారిగా కూల్ కూల్ గా వాతవరణం మారిపోయింది. చుట్టూ కారుమబ్బులు కమ్ముకోవడంతో మిట్ట మద్యాహ్నమే చిమ్మ చీకట్లను తలపించింది వాతవరణం. నిర్మల్ జిల్లా కేంద్రంలో వరుణుడి రాకతో..

TS Rains: ‘కమ్ముకొచ్చిన కారుమబ్బులు.. ముసురుకొన్న చిమ్మ చీకట్లు’ పట్టపగలే రోడ్లపై లైట్లతో ప్రయాణం
కోస్తాలో తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని.. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండి తన తాజా వెదర్ బుల్లెటిన్‌లో పేర్కొంది. రేపటికి బంగాళాఖాతంలో మరో ఉపర్తల ఆవర్తనం ఏర్పడనుంది.
Naresh Gollana
| Edited By: Srilakshmi C|

Updated on: Sep 03, 2023 | 4:33 PM

Share

ఆదిలాబాద్, సెప్టెంబర్ 3: నిన్న మొన్నటి వరకు బానుడి భగభగలతో అసలు ఈ కాలం వానకాలమా.. లేక వేసవి కాలమా అనేలా కనిపించిన వాతవరణం ఒక్జసారిగా మారిపోయింది. ఉక్కపోతకు విరామం ఇస్తూ ఒక్కసారిగా కూల్ కూల్ గా వాతవరణం మారిపోయింది. చుట్టూ కారుమబ్బులు కమ్ముకోవడంతో మిట్ట మద్యాహ్నమే చిమ్మ చీకట్లను తలపించింది వాతవరణం. నిర్మల్ జిల్లా కేంద్రంలో వరుణుడి రాకతో ఒక్కసారిగా వాతవరణం మారిపోయింది. తీవ్ర వేడి ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డ నిర్మల్ నగర వాసులు మారిన వాతవరణంతో అమ్మయ్యా అనుకున్నారు. వర్షాలు లేక పంటలు ఎండే పరిస్థితి కి చేరిన సమయాన ఒక్కసారిగా భారీ వర్షం కురియడం తో అన్నదాతలు హర్షం వ్యక్తం చేశారు.

నిర్మల్ జిల్లా కేంద్రంలో ఒక్కసారిగా మేఘాలు కమ్ముకోవడంతో మిట్ట మధ్యాహ్నమే చిమ్న చీకటిగా మారిపోయింది. కారు మబ్బులు క్షణాల్లో కమ్ముకొవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దట్టంగా కమ్ముకున్న మేఘాలకు తోడు భారీ వర్షం కురియడం తో అప్పుడే రాత్రి అయిందే అని ఫీలింగ్ ను తెప్పించింది వాతవరణం. మద్యాహ్నం ఒంటి గంటకు ఇలా చిమ్మ చీకట్లతో సరికొత్త గా కనిపించింది నిర్మల్ జిల్లా కేంద్రం. దారంతా చిమ్మ చీకటిగా మారడంతో వీది లైట్లు కూడా వేయాల్సి వచ్చింది. దీంతో పట్టణ వాసులంతా అప్పుడే రాత్రి అయిందా అన్న ఫీలింగ్ లోకి వెళ్లిపోయారు. రహదారులపై వాహనదారులు పట్టపగలే లైట్లను వేసుకొని మరీ ప్రయాణించాల్సి వచ్చింది. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏర్పడ్డ ఈ సుందర దృశ్యం పలువురిని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ దృశ్యాలను పట్టణ వాసులు తమ ఫోన్లలో బందించుకుని సంబరపడిపోయారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.