Telangana: ఎదురీత ముందు విధిరాత ఎంత.. రెండు కిడ్నీలు పాడైనా.. ఇంటర్‌లో

సిరి గత ఐదు సంవత్సరాలుగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతోంది. రోజురోజుకీ వాటి పనితీరు మందగించింది. వారానికి రెండుసార్లు డయాలసిస్‌ చేయాల్సిన పరిస్థితి. . అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ఇంటర్‌ ఫలితాల్లో ప్రతిభ చాటింది.

Telangana: ఎదురీత ముందు విధిరాత ఎంత.. రెండు కిడ్నీలు పాడైనా.. ఇంటర్‌లో
Siri With Her Mother
Follow us

|

Updated on: Apr 25, 2024 | 12:55 PM

ఎదురీత ముందు విధిరాత ఎంత చెప్పండి. దేవుడు వైకల్యం ఇచ్చినా కష్టాలను అధిగమించి.. అద్బుతాలు చేస్తున్నవారిని మనం చూస్తున్నాం. అలాగే ఈ అమ్మాయి అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతూ కూడా సత్తా చాటింది. వారానికి 2 సార్లు డయాలసిస్ తప్పనిసరి.. ఒంటిపై పిడికెడు కండ లేదు. కొంచెం దూరం నడిస్తే ఆయాసం. తన పనులు తాను చేసుకోడానికి కూడా సత్తువ లేని పరిస్థితి. అయినా సరే మొక్కవోని ఆత్మవిశ్వాసంతో చదువు కొనసాగించి.. తన ప్రతిభను చాటుకుంది ఈ పేదింటి సరస్వతి. బుధవారం వెల్లడైన ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన కూనారపు సిరి.. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది.  స్థానిక శారదానగర్‌లోని గవర్నమెంట్ గర్ల్స్ జూనియర్‌ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసిన సిరి.. CECలో 927 మార్కులు సాధించి కాలేజ్ టాపర్‌గా నిలిచింది.

గోదావరిఖని NTPC కృష్ణానగర్‌కు చెందిన కూనారపు పోశం, వెంకటలక్ష్మి దంపతులకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పోశం సెంట్రింగ్‌ పనులకు వెళ్తే వచ్చే డబ్బే కుటుంబానికి ఆధారం. పెద్ద కుమార్తె సిరి గత ఐదేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది. కాలం గడిచేకొద్దీ వాటి పనితీరు మరింత మందగించింది. 8 నెలల క్రితం రెండు కిడ్నీలు పూర్తిగా పాడవ్వడంతో అప్పటి నుంచి వారానికి రెండుసార్లు డయాలసిస్ చేయించుకుంటూ మంచానికే పరిమితమైంది. అయినా తనకు చదువకోవాలని ఆశ. చదువుపై ఆమెకు ఉన్న ఇంట్రస్ గమనించిన కాలేజ్ ప్రిన్సిపల్‌, లెక్చలర్స్ క్లాసులకు సంబంధించిన సమాచారాన్ని తోటి విద్యార్థుల ద్వారా ఆమెకు చేరవేస్తూ సెల్‌ఫోన్‌లో డౌట్స్ క్లారిఫై చేసేవారు. కుమార్తె పరిస్థితిని చూసి దుఃఖాన్ని దిగమింగుకుంటూ పేరెంట్స్ అన్ని విధాలుగా ప్రోత్సహించారు. మంచానికే పరిమితమైన సిరి.. పుస్కకాలతో కుస్తీపట్టి సొంతంగా చదువుకొని పరీక్షలు రాసి బెస్ట్ మార్కులు సాధించింది. కుమార్తె కిడ్నీ మార్పిడి వైద్య చికిత్సకు..  తమ ఆర్థిక పరిస్థితి సహకరించదని, దాతలు స్పందించి సాయం అందించాలని తండ్రి పోశం కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…  

కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!