Telangana: క్లియెరెన్స్ ఇచ్చినా కన్‌ఫ్యూజన్ ఎందుకు.? ఈరోజైనా క్లారిటీ వస్తుందా.?
కొత్త సర్కార్‌లో డిప్యూటీ సీఎం ఒకరా ? ఇద్దరా? పీసీసీ పగ్గాలెవరికి? ఎల్లా హోటల్ మీటింగ్ సారాంశం ప్రకారం .. సామాజిక సూత్రం ప్రకారం ఎస్టీ, బీసీలకు చెరొకటి చొప్పున రెండు డిప్యూటీ సీఎంలు ఇవ్వాలన్నది పార్టీ లైన్. రేవంత్‌కు సీఎం.. భట్టికీ డిప్యూటీ సీఎం. ఇంత వరకు ఓకే. కానీ బీసీ కోటాలో పొన్నం ప్రభాకర్ డిప్యూటీ సీఎం గిరిపై గురిపెట్టారట. కానీ భట్టి నుంచి అబ్జక్షన్. ఉంటే ఒకరే డిప్యూటీ సీఎం ఉండాలన్నది భట్టి వాదన...
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ప్రమాణస్వీకారం ఎందుకు ఆగింది.? క్లియెరెన్స్ ఇచ్చినా కన్‌ఫ్యూజన్ ఎందుకు? రేవంత్‌కు సీఎం పదవి ఇవ్వడంపై ఏకాభిప్రాయం కుదిరిందా? కుదిరితే ప్రమాణస్వీకారానికి ఎందుకు జాప్యం.? సీఎం రేసులో రేవంత్‌తో పాటు భట్టీ, ఉత్తమ్, జానారెడ్డి ఇంకా చాలా మంది పేర్లు ఎప్పటి నుంచో రీసౌండ్ ఇస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్‌లో అంతర్గతం ఏం జరుగుతోంది. సీఎం పదవిపై ఏకాభిప్రాయం వచ్చినా.. డిప్యూటీ సీఎం..కేబినెట్ శాఖలపై ఏకత్వం పొసగడంలేదా? రేవంత్.. భట్టి విక్రమార్క.. ఉత్తమ్‌కుమార్.. శ్రీధర్‌బాబు.. పొన్నం ప్రభాకర్ అండ్ కోమటిరెడ్డి బ్రదర్స్, ఎవరి ఆవాజ్ ఏంటన్నది చర్చగా మారిందిప్పుడు.
కొత్త సర్కార్‌లో డిప్యూటీ సీఎం ఒకరా ? ఇద్దరా? పీసీసీ పగ్గాలెవరికి? ఎల్లా హోటల్ మీటింగ్ సారాంశం ప్రకారం .. సామాజిక సూత్రం ప్రకారం ఎస్టీ, బీసీలకు చెరొకటి చొప్పున రెండు డిప్యూటీ సీఎంలు ఇవ్వాలన్నది పార్టీ లైన్. రేవంత్‌కు సీఎం.. భట్టికీ డిప్యూటీ సీఎం. ఇంత వరకు ఓకే. కానీ బీసీ కోటాలో పొన్నం ప్రభాకర్ డిప్యూటీ సీఎం గిరిపై గురిపెట్టారట. కానీ భట్టి నుంచి అబ్జక్షన్. ఉంటే ఒకరే డిప్యూటీ సీఎం ఉండాలన్నది భట్టి వాదన. దాంతో భట్టికి స్పీకర్ పదవి ఆఫర్ చేశారట పార్టీ పెద్దలు. ఒకవేళ ఆయన అందుకు అంగీకరించకపోతే శ్రీధర్‌బాబుకు స్పీకర్ పదవి ఇవ్వాలనేది సమాలోచనల సారాంశం. ఇదిలా ఉంటే టు టర్మ్ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ఉత్తమ్‌కుమార్ రెడ్డి తన మన్ కీ బాత్‌ను స్పష్టం చేశారు. తనకు సీఎం పదవి ఇవ్వకపోతే తన సతీమణి పద్మావతికి కేబినెట్‌లో కీలక శాఖ ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది.
ఎల్లా హోటల్‌లో గెలిచిన అభ్యర్థుల సమక్షంలో చర్చోపచర్చలు జరుగుతుంటే మరోవైపు పార్క్ హయత్ హోటల్‌లో కోమటిరెడ్డి బ్రదర్స్ ఆధ్వర్యంలో టేబుల్ బేటీలు జరిగాయి. రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం ఏర్పాట్లు.. కొత్త సర్కార్‌కు కాన్వాయ్ అరెంజ్‌మెంట్ చకచకా జరిగాయి. కానీ ఎల్లా హోటల్ సమావేశం నుంచి మాత్రం సీఎం ఎవరనే సందేశం రాలేదు. సడెన్‌గా సీను ఢిల్లీకి మారింది. షరామాములుగానే మళ్లీ సీల్డ్ కవర్ కాంగ్రెసీయం తెరపైకి వచ్చింది. ప్రమాణ స్వీకారం ఆలస్యానికి కారణం..సీఎం ఎవరనే ఇంకా తేలకపోవడమా? రేవంత్‌కు గ్రీన్ సిగ్నల్ వచ్చినా డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్, కేబినెట్‌లో కీలక శాఖలపై అభిప్రాయాలు పొసగకపోవడమా?
ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విక్టరీ రన్ ఊపందుకోగానే రేవంత్ రెడ్డి గాంధీభవన్‌లో ప్రెస్‌మీట్ పెట్టారు. ప్రగతి భవన్‌ను అంబేద్కర్ ప్రజాభవన్‌గా మారుస్తామన్నారు. కాబోయే సీఎం ఎవరో తెలంగాణ సమాజానికి రేవంత్ ప్రెస్‌మీట్ సందేశం ఇచ్చిందని అంతా భావించారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో ఇంటర్నల్ జరుగుతోన్న కిస్సా కూడా సీఎం కుర్సీ కోసం కాదని.. , ముఖ్యమంత్రిగా రేవంత్‌నే హైకమాండ్ డిసైడ్ చేసిందని… కేవలం డిప్యూటీ సీఎం..పీసీసీ చీఫ్, స్పీకర్, కేబినెట్‌లో కీలక శాఖల గురించే అంతర్మధనం అనేది ఓ చర్చ.
ఎంతైనా కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం రూటే సపరేటు. తెలంగాణలో కాంగ్రెస్ పైచేయి సాధించింది. తెలంగాణ సర్కార్ ఏర్పాటు మాత్రం ప్రస్తుతం కాంగ్రెస్ హైకమాండ్ చేతిలో వుంది. 3 రాష్ట్రాల్లో ఓటమిపై సమీక్ష..పార్లమెంట్ సమావేశాలతో హైకమాండ్ బీజీగా వుంది. అందువల్లే తెలంగాణ సర్కార్ ఏర్పాటుపై ఫోకస్ పెట్టే సమయం చిక్కలేదనేది నిజమా? అబ్జర్వర్లతో కొలిక్కి రాలేదు కాబట్టే హైదరాబాద్ మ్యాటర్ ఢిల్లీ గట్టుకు చేరిందా? 7న ప్రమాణస్వీకారం చేసేదెవరు? ఢిల్లీ నుంచి తరలి వచ్చే అతిథులు ఎవరు? హైకమాండ్ ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్దుందని ఎదురుచూస్తోంది టీ కాంగ్రెస్. అన్నీ మంచిశకునాలే వున్నా ఇంకా వై దిస్ లేట్ వర్రీ..!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..