AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: క్యాన్సర్‌తో బాధపడుతున్న యువతి.. చివరి ఆకాంక్షను నెరవేర్చిన మంత్రి జగదీష్, పోలీసన్నలు..

Suryapet police: క్యాన్సర్‌తో బాధపడుతున్న యువతి ఆకాంక్షను సూర్యాపేట పోలీసులు నెరవేర్చారు. ఆమెను ఒక్క రోజు ఎస్సైను చేశారు. మేక్ ఏ విష్ కార్యక్రమంలో భాగంగా యువతి కోరికను నెరవేర్చి పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు.

Telangana: క్యాన్సర్‌తో బాధపడుతున్న యువతి.. చివరి ఆకాంక్షను నెరవేర్చిన మంత్రి జగదీష్, పోలీసన్నలు..
Suryapet Police
Shaik Madar Saheb
|

Updated on: Jun 06, 2023 | 9:57 PM

Share

Suryapet police: క్యాన్సర్‌తో బాధపడుతున్న యువతి ఆకాంక్షను సూర్యాపేట పోలీసులు నెరవేర్చారు. ఆమెను ఒక్క రోజు ఎస్సైను చేశారు. మేక్ ఏ విష్ కార్యక్రమంలో భాగంగా యువతి కోరికను నెరవేర్చి పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం జగన్ తండాకు చెందిన ధరవత్ చాంప్ల-భూభా దంపతుల కుమార్తె స్వాతి.. ఆమె చదువుతో పాటు ఆట పాటల్లోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. డిగ్రీ రెండవ సంవత్సరంలో ఉన్న స్వాతి ఒక్కసారిగా జ్వరం బారిన పడింది. దానికి తోడు కామెర్లు రావడం ఆపై ఫ్రాంక్రియాటిస్ కేన్సర్ గా మారింది. మందులతో కాలాన్ని నెట్టుకోస్తున్న స్వాతి పరిస్థితి చెయి దాటి పోయేలా ఉందని తల్లిదండ్రులు భావించారు.

క్యాన్సర్‌తో పోరాడుతున్న బిడ్డతో వచ్చిన వ్యాధి తగ్గుతోందో లేదో తెలియదు కానీ నీకు ఏమైనా కోరికలు ఉంటే చెప్పమ్మా అని తల్లిదండ్రులు అడిగారు. యువతి చెప్పిన సమాధానంతో తల్లితండ్రులు ఒక్కసారిగా షాకయ్యారు. తనకు మంత్రి జగదీష్ రెడ్డితో మాట్లాడాలని, ఆయనతో కలిసి భోజనం చేయాలని ఉందంటూ తన మనసులోని మాటను స్వాతి బయట పెట్టింది. ఇది విన్న డాక్టర్ల బృందం మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అందుకు స్పందించిన మంత్రి జగదీష్ రెడ్డి.. ఆమెతో పాటు కుటుంబ సభ్యులతో కలసి అల్పాహారం చేశారు.

Suryapet Police

Suryapet Police

ఈ క్రమంలోనే తనకు ఒక్కసారి పోలీస్ ఆఫీసర్ కావాలని ఉందని మంత్రి జగదీష్ రెడ్డికి స్వాతి విన్నవించుకుంది. స్వాతి కోరికను నెరవేర్చాలని మంత్రి జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ను ఆదేశించారు. దీంతో కోరిక నెరవేర్చేందుకు చివ్వెంల పోలీసులు ముందుకొచ్చారు. ఆమె ఫుల్ యూనిఫాంలో చివ్వెంల పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా బాధ్యతలు తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ SHO గా ఒకరోజు విధులు నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా స్వాతి పోలీసులకు శాంతిభద్రతలపై సూచనలు చేశారు. ఎస్సైగా విధులు నిర్వహించిన స్వాతి రాత్రి తన గ్రామానికి పోలీస్ అధికారిగా చేరుకుంది. తన విష్ ను నెరవేర్చినందుకు చివ్వెంల పోలీసులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. పోలీసులు ఇచ్చిన ధైర్యంతో జీవితంలో ముందుకు సాగే ప్రయత్నం చేస్తానని ఆమె పేర్కొంది.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. స్వాతి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

-రేవన్‌ రెడ్డి, టీవీ9 రిపోర్టర్‌, నల్లగొండ..