AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dashabdi Utsavalu: మైహోం సిమెంట్స్ ఇండస్ట్రీలో తెలంగాణ ప్రగతి ఉత్సవాలు..

మైహోం సిమెంట్స్ ఇండస్ట్రీలో తెలంగాణ ప్రగతి ఉత్సవాలు అంగరం వైభంగా జరిగాయి. పరిశ్రమలకు అంతరాయం లేని విద్యుత్ అందిస్తూ దేశానికే తెలంగాణ తలమానికమైందని చెప్పారు ఎమ్మెల్యే సైదిరెడ్డి.

Dashabdi Utsavalu: మైహోం సిమెంట్స్ ఇండస్ట్రీలో తెలంగాణ ప్రగతి ఉత్సవాలు..
Dashabdi Utsavalu
Surya Kala
|

Updated on: Jun 07, 2023 | 7:10 AM

Share

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తాజాగా సూర్యపేట జిల్లా మేళ్లచెరువు మండలం మై హోమ్ సిమెంట్స్ ఇండస్ట్రీలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ తిరుపతయ్య హాజరయ్యారు. మై హోమ్ ఇండస్ట్రీస్ ప్లాంట్ హెడ్ శ్రీనివాసరావు ప్రగతి ప్రొగ్రాంలో పాల్గొన్నారు. టీఎస్ ఐపాస్ వల్ల ఎంతో మేలు జరుగుతుందన్నారు ఎమ్మెల్యే సైదిరెడ్డి. రోజుల తరబడి ఆఫీసులో చుట్టూ తిరగకుండా 30 రోజులలో ఏ పరిశ్రమకైన అనుమతులైన ఇచ్చే అద్భుతమైన ప్రగతి టీఎస్ ఐపాస్ అని చెప్పారు. గత పాలకులు వేసవికాలం సమ్మర్ హాలిడేస్‌గా ప్రకటిస్తే కెసిఆర్ వచ్చిన తొమ్మిది ఏళ్లలో ఒక్కరోజు కూడా విద్యుత్ అంతరాయం లేకుండా ఇచ్చిన ఘనత కేసిఆర్ కు దక్కుతుందన్నారు.

పోలీసింగ్ వ్యవస్థ, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతు బీమా అమలు చేస్తూ తెలంగాణ రాష్ట్రం దేశానికి తలమానికంగా తయారైందని చెప్పారు ఎమ్మెల్యే. పరిశ్రమలలో స్థానిక యువతకు ఎక్కువగా అవకాశాలు కల్పించాలని సిఎస్‌ఆర్ ఫండ్ స్థానికంగానే ఎక్కువగా ఖర్చు పెట్టాలని ఇది మానవతా దృక్పథంతో ఆలోచించాలని కోరారు ఎమ్మెల్యే.

తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని పరిశ్రమలకు కరెంటు కోతలు లేకుండా చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు మై హోమ్ ప్లాంట్ హెడ్ శ్రీనివాస్. తాగునీరు సాగునీరు రంగానికి కూడా ఎంతో అభివృద్ధి చేసిందని అన్నారు. ఈ కార్యక్రమానికి హుజూర్నగర్ నియోజకవర్గంలోని అన్ని పరిశ్రమల స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..