Dogs Bite: ఆదిలాబాద్‌లో పిచ్చి కుక్కల స్వైర విహారం.. 21మందిపై దాడి.. బాధితుల్లో రెండేళ్ల చిన్నారి, గర్భిణీ

ఆదిలాబాద్ ఇంద్రవెల్లి మండలంలో పిచ్చి కుక్కలు రెచ్చిపోయయి. ఆరు గంటల వ్యవధిలో ఐదు పిచ్చి కుక్కలు 21 మందిపై దాడి చేశాయి.

Dogs Bite: ఆదిలాబాద్‌లో పిచ్చి కుక్కల స్వైర విహారం.. 21మందిపై దాడి.. బాధితుల్లో రెండేళ్ల చిన్నారి, గర్భిణీ
Stray Dogs
Follow us
Surya Kala

|

Updated on: Mar 19, 2023 | 8:52 AM

తెలంగాణాలో రోజు ఎక్కడోచోట పిచ్చి కుక్కలు దాడి చేసిన ఘటనలకు సంబంధించిన వార్తలు వింటూనే ఉన్నాం.. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేశాయి. దారిన పోయేవారిని హడలెత్తించాయి. గంటల వ్యవధిలోనే పలువురిని కరచాయి. బాధితుల్లో ఒక గర్భి, చిన్నారి కూడా ఉండటం గమనార్హం. దీంతో జనం భయభ్రాంతులకు గురయ్యారు. ఆ దారిన వెళ్లేందుకు జనం వణికిపోయారు. వివరాల్లోకి వెళ్తే..

ఆదిలాబాద్ ఇంద్రవెల్లి మండలంలో పిచ్చి కుక్కలు రెచ్చిపోయయి. ఆరు గంటల వ్యవధిలో ఐదు పిచ్చి కుక్కలు 21 మందిపై దాడి చేశాయి. ఇంద్రవెళ్లి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ పై సైతం కుక్కలు దాడి చేశాయి. తీవ్ర గాయాలు అయిన యశోద (8) అనే చిన్నారిని చికిత్స నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. భట్టి యాత్రలో పాల్గొనేందుకు ఖమ్మం నుండి‌ వచ్చిన ఇద్దరిపై దాడి చేశాయి పిచ్చి కుక్కలు

కుక్కల దాడిలో ఇంద్రవెళ్లి కి చెందిన రెండేళ్ల చిన్నారి అఫ్రోజ్ తో సహా గౌతమ్ (24), నిర్గున (20), సమీర్ (16), మహేర్ (15), లక్ష్మి(15), దివ్య(15), ఫాతిమా(60), యశోద(13), శంకర్ (13)ల సహా లక్ష్మీ (28) అనే గర్భిణీ పై దాడికి యత్నం చేశాయి పిచ్చి కుక్కలు. అయితే గర్భిణీ  స్వల్ప గాయాలతో బయటపడింది.

ఇవి కూడా చదవండి

ఖమ్మం జిల్లా నుంచి భట్టి విక్రమార్క హాథ్ సే హాథ్ జోడో పాదయాత్రకు వచ్చిన మద్ది వీరారెడ్డి (45), సతీషన్ అనే ఇద్దరు వ్యక్తులను కుక్కలుకరిచాయి. బాధితులు వెంటనే సమీప ఆసపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పిచ్చికుక్కల వరుస దాడులతో.. ఇంద్రవెళ్లి మండలవాసుల్లో భయాందోళనకు గురవుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..