Good News: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఉద్యోగులకు ఉగాది కానుక.. కొత్త వేతన విధానం అమలుకు ఉత్తర్వులు..

ఇటీవల ఇచ్చిన హామీ మేరకు వారికి పేస్కేల్‌ వర్తింపజేస్తూ జీవో 11 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి.

Good News: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఉద్యోగులకు ఉగాది కానుక..  కొత్త వేతన విధానం అమలుకు ఉత్తర్వులు..
RD Scheme
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 19, 2023 | 9:14 AM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెర్ప్‌ ఉద్యోగులకు ఉగాది కానుక ప్రకటించింది. ఇటీవల ఇచ్చిన హామీ మేరకు వారికి పేస్కేల్‌ వర్తింపజేస్తూ జీవో 11 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. ప్రభుత్వ ప్రకటనపై వివిధ కేడర్‌లలో ఉన్న సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు కరీంనగర్‌ స్వశక్తి కళాశాలలోని సెర్ప్‌ కార్యాలయంలో సీఎం కేసీఆర్‌, ఇతర మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఉద్యోగులు. సెర్ప్‌ ఉద్యోగులు తమ సర్వీసు కాలంలో ప్రభుత్వ ఉద్యోగులతో సమాన వేతనాలు అందుకోవడం కష్టం అనుకున్న సమయంలో పేస్కేల్‌ అమలు చేస్తూ, ఉగాది కానుకను అందించబోతున్నది. ఇటీవల ఇచ్చిన హామీ మేరకు వారికి పేస్కేల్‌ వర్తింపజేస్తూ, జీవో 11 ద్వారా పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సందీప్‌కుమార్‌ సుల్తానియా  ఉత్తర్వులను విడుదల చేశారు.

కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి రానుండగా, ఒక్కో ఉద్యోగికి కనిష్టంగా రూ.19వేల నుంచి రూ.59వేల వరకు, గరిష్టంగా రూ.51వే ల నుంచి రూ.1.28లక్షల వరకు వేతనాలు పెరుగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 3,978 మంది వివిధ కేడర్‌లలోని సెర్ఫ్‌ సిబ్బందికి లబ్ధి పేస్కే ల్‌ వర్తించనుంది.

కరీంనగర్‌ జిల్లాలో 117 మంది కి లబ్ధి కలుగనుంది. ఉమ్మడి రాష్ట్రంలో 2002 లో ప్రారంభమైన గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో జిల్లా స్థాయిలో అడిషనల్‌ డీఆర్‌డీవో, డీపీఎం, మండల స్థాయిలో ఏపీఎం, సీసీలు, ఎంఎస్‌సీసీలు, డ్రైవర్లు, ఆఫీస్‌ సబార్డినేట్లు, అ డ్మినిస్ట్రేషన్‌ అసిస్టెంట్లు, ప్రాజెక్టు సెక్రటరీలు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, తదితర మినిస్టీరియల్‌ ఉద్యోగులుగా తాత్కాలిక పద్ధతిన నియమితులై విధులు నిర్వహిస్తున్నారు.

ప్రస్తుతం 716 మంది పదో తరగతి అర్హతతో మండల సమాఖ్య కమ్యూనిటీ కో-ఆర్డినేటర్లుగాను, మరో 21 మంది మండల, డివిజన్‌ ప్రతినిధులుగాను ఉన్నారు. వారికి రూ.19,000-58,850 స్కేలు వర్తిస్తుంది. ఇందులోనే ఇంటర్‌ అర్హతతో పనిచేస్తున్న 338 మంది మండల బుక్‌ కీపర్లకు రూ.22,240-67,300 స్కేలు.. డిగ్రీ అర్హతతో కమ్యూనిటీ కోఆర్డినేటర్లుగా ఉన్న 1,719మందికి రూ.24,280-72,850 స్కేలు వర్తించనుంది.

పీజీ అర్హతతో సహాయ ప్రాజెక్టు మేనేజర్లుగా పనిచేస్తున్న 697 మందికి రూ.32,810-96,890 స్కేలు వర్తిస్తుంది. పీజీ అర్హతతోనే జిల్లా ప్రాజెక్టు మేనేజర్లుగా ఉన్న 160 మందికి రూ.42,300-1,15,270 స్కేలు.. ప్రాజెక్టు మేనేజర్లుగా ఉన్న 37 మందికి రూ.51,320 – 1,27,310 వేతన స్కేలు తీసుకోనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం