Voter ID: ఓటరు జాబితా సవరణకు ప్రత్యేక క్యాంపెయిన్.. ఈ రెండు తేదీలు కీలకం..!
Voter List: ఈ నెల 27, 28 తేదీలలో ఓటరు జాబితా సవరణ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల అధికారులు తెలిపారు. ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం
Voter List: ఈ నెల 27, 28 తేదీలలో ఓటరు జాబితా సవరణ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల అధికారులు తెలిపారు. ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దీనికి సంబంధించి హైదరాబాద్ నగర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు మాట్లాడుతూ.. ఓటర్ జాబితా సవరణపై ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. భారత ఎన్నికల కమిషన్ 2021 కి సంబంధించిన ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసినందున.. ఓటరు జాబితాలో మార్పులు, చేర్పుల కోసం నవంబర్ 27, 28 తేదీలలో ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
పోలింగ్ బూత్ స్థాయి అధికారులు పోలింగ్ బూత్‌లో ఉదయం నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉంటారని, ఆ సమయంలో ఓటర్లు తమ ఓటర్ ఐడీలో మార్పులు, చేర్పులు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. దీనిని ఓటర్లందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇదిలాఉంటే.. జనవరి1, 2022 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు కూడా నూతన ఓటరుగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇక కళాశాలలో చదువుతున్న విద్యార్థినుల ఓటరు నమోదు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు చేసుకునేలా తమ వంతు కృషి చేస్తామన్నారు.
Also read:
Pushpa Song: పుష్ప రాజ్ ఊరమాస్ లుక్.. ఏయ్ బిడ్డా ఇది నా అడ్డ లిరికల్ ప్రోమో రిలీజ్..
Ramya Krishna: మెగాస్టార్ సినిమాలో రమ్యకృష్ణ.. కీలక పాత్రలో నటించనున్న శివగామి..