Telangana: 15 ఏళ్ల నుంచి ఉన్నదే కదా.. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ఏమన్నారో తెలుసా..?

తెలంగాణలో MLAల ఫిరాయింపులపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. నిర్ణయం చెప్పాలంటూ స్పీకర్‌ కార్యదర్శికి హైకోర్టు ఇచ్చిన గడవు మరో రెండు వారాలే వుంది. మరి స్పీకర్‌ కార్యదర్శి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు.? చర్యల వ్యవహారంలో బంతి అటు తిరిగి ఇటు తిరిగి మళ్లీ కోర్టుకే చేరనుందా?..టీవీ9తో ఎక్స్‌క్లూజివ్‌గా స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ మన్‌ కీ బాత్‌...

Telangana: 15 ఏళ్ల నుంచి ఉన్నదే కదా.. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ఏమన్నారో తెలుసా..?
Speaker Gaddam Prasad Kumar
Follow us

|

Updated on: Sep 25, 2024 | 8:54 AM

తెలంగాణలో కాంగ్రెస్‌- బీఆర్‌ఎస్‌ మధ్య మాటల యుద్ధం పీక్స్‌కు వెళ్లింది. ముఖ్యంగా ఎమ్మెల్యేల ఫిరాయింపుపై రచ్చ కంటిన్యూస్‌గా మారింది. దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలని హైకోర్టును ఆశ్రయించింది బీఆర్‌ఎస్‌. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యలపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కి కోర్టు సూచించింది, నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా మళ్లీ కేసు విచారణ చేపడుతామంది. రెండు వారాలు గడిచాయి. స్పీకర్‌ ఏం నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

వివరణ ఇవ్వమని ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇస్తారా? గడువు పెంచాలని కోర్టును కోరుతారా? అసెంబ్లీ రికార్డుల ప్రకారం పార్టీ మారిన ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌ సభ్యులుగానే కొనసాగుతారనని కోర్టు దృష్టికి తీసుకెళ్తారా? వీటిలో స్పీకర్‌ ఏ ఆప్షన్‌ తీసుకుంటారనేది చర్చగా మారింది.ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యటనలో టీవీ9తో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడారు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌. పార్టీ ఫిరాయింపులపర్వం ఇప్పుడే కొత్త కాదు ..15 ఏళ్ల నుంచే వున్నదే కదా అన్నారు. ప్రస్తుతం ఆ అంశం కోర్టు పరిధిలో వుంది కాబట్టీ తాను స్పందించడం భావ్యం కాదన్నారు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌.

స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ తన మన్‌ కీ బాత్‌ చెప్పారు.మరోవైపు బీఆర్‌ఎస్‌ నేతలు మాత్రం ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఖాయం అంటోంది బీఆర్‌ఎస్‌. పార్టీ మారిన ఎమ్మెల్యేల ఇక అలా ఉండటమేనని.. ఉపఎన్నికలు తప్పవంటూ కేటీఆర్‌ పేర్కొన్నారు.

వీడియో చూడండి..

శేరిలింగంపల్లి లో జరిగిన పార్టీ కార్యాక్రమంలో మాట్లాడుతూ ఉప ఎన్నిక ఖాయమన్నారు కేటీఆర్‌. ఇక ఇప్పటికే అరికెపూడి గాంధీకి పీఏసీ ఇవ్వడంపై రెండు పార్టీల నేతల మధ్య డైలాగ్‌ వార్‌ దద్దరిల్లుతోంది. ఇక రీసెంట్‌గా సీఎల్పీ మీటింగ్‌లో ఆయన తళుక్కుమనడంతో రెండు పార్టీల మధ్య వాడీ వేడి విమర్శల అలజడి మరింత పెరిగింది. . ఫిరాయింపులను ఇంకా బుకాయించలేరని ట్వీట్‌ చేశారు హరీష్‌ రావు. అరెకపూడి వచ్చింది సీఎల్పీ మీటింగ్‌కు కాదు సీఎంను మీటయ్యేందుకని కౌంటర్‌ ఇచ్చారు మంత్రి శ్రీధర్‌ బాబు.

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఇచ్చిన గడువులో రెండు వారాలు పూర్తయ్యాయి. అనర్షత వేటు ఖాయమంటోంది బీఆర్‌ఎస్‌. మరోవైపు అవసరమైతే డివిజన్‌ బెంచ్‌కు వెళ్తామన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి..

ఎవరి వాదన వారిది. హైకోర్టు ఇచ్చిన గడువుకు ఇక మిగిలింది రెండు వారాలే. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ మన్‌ కీ బాత్‌ ప్రకారం ఫిరాయింపుల వ్యవహారం బంతి మళ్లీ కోర్టుకు వెళ్లినట్టేనా? అనే చర్చ జరుగుతోందిప్పుడు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..