Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: మహిళల కోసం కొత్త స్కీమ్ తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ కసరత్తు..

తెలంగాణలో ప్రవేశపెట్టిన పథకాలు దేశం దృష్టిని ఆకర్షించాయని.. కల్యాణ లక్ష్మి నుంచి మొదలుపెడితే రైతుబంధు వరకు అనేక రాష్ట్రాలు తమ పథకాలను కాపీ కొట్టాయని బీఆర్ఎస్ నాయకులు తరచుగా చెబుతుంటారు. అయితే అన్ని వర్గాలకు ప్రత్యేక పథకాలు పెట్టిన కేసీఆర్ మహిళల కోసం మాత్రం ప్రత్యేకంగా ఎలాంటి స్కీం ప్రవేశపెట్టలేదు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ మహిళలే లక్ష్యంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు, రుణాలు అంటూ మేనిఫెస్టోలో ప్రకటనలు చేసింది.

CM KCR: మహిళల కోసం కొత్త స్కీమ్ తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ కసరత్తు..
Telangana CM KCR
Follow us
Rakesh Reddy Ch

| Edited By: Aravind B

Updated on: Oct 02, 2023 | 10:08 PM

తెలంగాణలో ప్రవేశపెట్టిన పథకాలు దేశం దృష్టిని ఆకర్షించాయని.. కల్యాణ లక్ష్మి నుంచి మొదలుపెడితే రైతుబంధు వరకు అనేక రాష్ట్రాలు తమ పథకాలను కాపీ కొట్టాయని బీఆర్ఎస్ నాయకులు తరచుగా చెబుతుంటారు. అయితే అన్ని వర్గాలకు ప్రత్యేక పథకాలు పెట్టిన కేసీఆర్ మహిళల కోసం మాత్రం ప్రత్యేకంగా ఎలాంటి స్కీం ప్రవేశపెట్టలేదు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ మహిళలే లక్ష్యంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు, రుణాలు అంటూ మేనిఫెస్టోలో ప్రకటనలు చేసింది. అటు బీజేపీ కూడా మహిళ సమృద్ధి అంటూ ప్రత్యేక పథకాలను మేనిఫెస్టోలో పెట్టేందుకు సిద్ధమవుతుంది. దీంతో బీఆర్‎ఎస్ కూడా మహిళల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని కులాల వారిగా, మతాలవారీగా, వర్గాల వారీగా పథకాలను ప్రవేశపెట్టిన బీఆర్ఎస్ పార్టీ.. మహిళల కోసం కొత్త స్కీం పెట్టడం పెద్ద పనేం కాదు. కానీ అది ఇతర పార్టీల కంటే భిన్నంగా.. ప్రతిపక్ష పార్టీల హామీలను తలదన్నేలా ఉండాలనేది బీఆర్ఎస్ ఆలోచన.

ఇందుకోసం కేసీఆర్ కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. నెలనెలా మహిళల కోసం డైరెక్ట్ మనీ ఇవ్వడం కంటే.. ఒకేసారి బీసీ బంధు తరహాలో ఇవ్వడం మంచిదని భావిస్తున్నారు. మహిళా ఓటర్లు ఎటువైపు మొగ్గితే ఆ పార్టీ విజయం ఖాయం. మరోవైపు తెలంగాణలో 64 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లదే పైచేయి. దీంతో మహిళలకు ఒక్కొక్కరికి లక్ష, రెండు లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం చొప్పున ఇవ్వడమా, లేక రుణంగా కాకుండా దళిత బంధు, బీసీ బంధు తరహాలో సొంతంగా వ్యాపారాలు పెట్టుకోవడానికి ప్రభుత్వ సహాయంగా ఇవ్వడం అనేది ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న చర్చ. కేవలం డబ్బులు ఇవ్వడమే కాకుండా ఇంకా ఏ రకంగా మహిళలకు చేయూత ఇవ్వగలుగుతామనేది ఆలోచిస్తున్నారు గులాబి నేతలు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న పథకాలపై కూడా దృష్టి పెట్టారు.

దేశంలో మహిళల కోసం పెట్టిన స్కీములు ఎక్కడ ఏ రకంగా పనిచేస్తున్నాయి దాని ద్వారా ఎంత ఫలితాలు వస్తున్నాయని సమాచారం కూడా తెప్పించుకున్నట్లు తెలుస్తుంది. ఇక కేసీఆర్ పెట్టే స్కీమ్ అంటే మైండ్ బ్లాక్ అయినట్లే ఉంటుందని అంటుంటారు. ప్రస్తుతం ఈ అంశం రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఇప్పుడు మహిళల కోసం ఆయన ఎలాంటి తీసుకొస్తారనేది అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇప్పటికే సీఎం కేసీఆర్ 115 నియోజకవర్గాలకు తమ పార్టీ అభ్యర్థులు జాబితాను ప్రవేశపెట్టారు. ఇక త్వరలోనే బీజేపీ, కాంగ్రెస్‌లు సైతం తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..