AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Warangal: యూనివర్శిటీలో నాగుపాము హల్‌చల్‌ .. పరుగులు తీసిన సిబ్బంది, విద్యార్ధులు.. ఈ పాము స్పెషాలిటీ ఏమిటంటే..

యూరివర్శిటీలోని మానవీయ శాస్త్ర విభాగం పార్కింగ్ కేంద్రం వద్ద త్రాచుపాము ప్రత్యక్షమైంది. పార్కింగ్ సెంటర్లో రేకుల వద్ద తాచుపాము బుసలు కొడుతుండగా ఉద్యోగులు, విద్యార్ధులు గమనించి పరుగులు పెట్టారు. వెంటనే పాములు పట్టే వ్యక్తికి సమాచారం అందించారు సిబ్బంది.

Warangal: యూనివర్శిటీలో నాగుపాము హల్‌చల్‌ .. పరుగులు తీసిన సిబ్బంది, విద్యార్ధులు.. ఈ పాము స్పెషాలిటీ ఏమిటంటే..
Snake Found In University
G Peddeesh Kumar
| Edited By: Surya Kala|

Updated on: Aug 10, 2023 | 9:15 AM

Share

వరంగల్‌ కాకతీయ విశ్వవిద్యాలయలంలో నాగుపాములకు కేరాఫ్‌గా మారింది. హాస్టల్ పరిసరాల్లో ఎలుకలు స్వైరవిహారం చేస్తుంటే ఆ ఎలకల కోసం పాములు యూనివర్శిటీలో చొరబడుతున్నాయి. దాంతో విద్యార్ధులు భయంతో పరుగులు పెడుతున్నారు. ఇటీవల హాస్టల్ గదిలో విద్యార్థులను ఎలుకలు కొరికి గాయపరిచిన ఘటన మరువకముందే పాముల స్వైర విహారం విద్యార్ధులను మరింత భయాందోళనకు గురిచేస్తోంది. తాజాగా యూరివర్శిటీలోని మానవీయ శాస్త్ర విభాగం పార్కింగ్ కేంద్రం వద్ద త్రాచుపాము ప్రత్యక్షమైంది. పార్కింగ్ సెంటర్లో రేకుల వద్ద తాచుపాము బుసలు కొడుతుండగా ఉద్యోగులు, విద్యార్ధులు గమనించి పరుగులు పెట్టారు. వెంటనే పాములు పట్టే వ్యక్తికి సమాచారం అందించారు సిబ్బంది.

వెంటనే స్పాట్‌కు చేరుకున్న స్నేక్స్ క్యాచర్ ఆ పామును పట్టి ధర్మసాగర్ ప్రాంతంలోని పార్కులో పామును వదిలేశారు. దీంతో విద్యార్థులు ఉద్యోగులు యూనివర్సిటీ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. అయితే కేయూ క్యాంపస్ లో పరిసరాల్లో చెట్లు ముళ్లపొదలు ఎక్కువగా ఉండడం, ఆహారపు వ్యర్ధాలు, చెత్త ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా పడేయడం, పుట్టలు ఎక్కువగా ఉండడం వల్లే పాములు వస్తున్నాయని స్నేక్స్ క్యాచర్స్ అంటున్నారు. పరిశసరాలు శుభ్రంగా ఉంచుకోకపోతే ఎలుకలు చేరడం, వాటికోసం ఇలా పాములు చొరబడుతుంటాయని చెబుతున్నారు. యూనివర్శిటీ పరిశరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

ఆసియా త్రాచు భారతదేశానికి చెందిన విషం కలిగిన పాము. మిగతా త్రాచు పాములవలే నాగుపాము కూడా తన పడగ విప్పి భయపెట్టటంలో ప్రసిద్ధి చెందింది. భారతదేశానికి చెందిన నాగుపాములు ఏప్రిల్, జూలై నెలల మధ్య గుడ్లు పెడతాయి. ఒక్కసారే 12 నుండి 30 వరకు గుడ్లను బొరియలలో పెడతాయి. ఈ గుడ్లు 50 రోజుల నుంచి 69 రోజులలో పొదిగి పిల్లలుగా మారతాయి. అప్పుడే పుట్టిన పిల్ల పాములు 8 నుంచి 12 అంగుళాల వరకు ఉంటాయి. అంతేకాదు అంతే కాదు ఈ పిల్ల పాములు విషపు గ్రంథులను కలిగి ఉంటాయి. నాగు పాములు ఎలుకలను తింటాయి. ఇవి అడవులు, పొలాలు, మురుగుకాల్వలు, బొరియల్లో నివసిస్తాయి.    అయితే జెర్రిపోతు పాములను నాగు పాములుగా చూడడనికి ఒకేలా ఉంటాయి.. అయితే జెర్రిపోతు విషపూరితం కాదు.   (సేకరణ వికీపీడియా )

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..