Kamareddy: మిని గురుకులంలో విద్యార్థినికి పాముకాటు.. దాని కోసం వెతకగా.. షాక్
మినీ గురుకులంలో పాముల సంచారంతో విద్యార్థినిలు టెన్షన్ పడుతున్నారు. ఒకేసారి చాలా పాములు కనిపించడంతో వారు భయబ్రాంతులకు గురయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి...

కామారెడ్డి జిల్లాలోని ఓ మినీ గురుకులం పాఠశాలలో విద్యార్థినికి పాము కాటు కలకలం రేపింది. మాచారెడ్డి మండల కేంద్రంలోని మినీ గురుకుల పాఠశాలలో నాలుగవ తరగతి చదువుతున్న విద్యార్థిని నిఖిత బుధవారం రాత్రి వరండాలో కూర్చుని ఉంది. ఆ సమయంలో ఎటు నుంచి వచ్చిందో ఏమో కానీ.. నిఖిత కుడి కాలు బొటనవేలుపై పాము కాటు వేసింది. వెంటనే అలెర్టయిన ప్రిన్సిపాల్.. చికిత్స నిమిత్తం విద్యార్థినిని కామారెడ్డి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ తరలించారు. ఆపై వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారమిచ్చి.. ఆ పాము కోసం వెతికించారు. ఆ పాము జాడ పట్టి చంపుతుండగా.. మరో నాలుగు పాములు ప్రత్యక్షమయ్యాయి. వాటిలో రెండు పాములను స్థానికులు చంపేయగా.. మరో రెండు తప్పించుకున్నాయి. ప్రస్తుతం విద్యార్థిని నిఖిత కామారెడ్డి గవర్నమెంట్ ఏరియా ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతుంది. ఒకేసారి అన్ని పాములు కనిపించడంతో.. మినీ గురుకులం విద్యార్థినిలు టెన్షన్ పడుతున్నారు.
పిల్లలు ఉండే గురుకులాల్లో పాములు సంచరించడంపై తల్లిదండ్రులు ఫైరవుతున్నారు. అసలు అక్కడ సరైన సౌకర్యాలు ఉన్నాయా అని ప్రశ్నిస్తున్నారు. పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత అధికారులది అని చెబుతున్నారు. ప్రజంట్ వర్షాకాలం కావడంతో.. భారీ వానలు, వరదలు ఆవాసాలు కోల్పోయి.. సర్పాలు జనవాసాల్లోకి వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు తొలకరి జల్లులకు గడ్డి ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి.. పాములు సంచరించే అవకాశం ఉంది. జనాలు అప్రమత్తంగా ఉండాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..